ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన క , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ అనే రెండు తెలుగు సినిమాలతో పాటు శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన తమిళ డబ్బింగ్ సినిమా అమరన్ , భగీర అనే కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో భగీర సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం కలెక్షన్లు దక్కలేదు. ఓవరాల్ గా కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇకపోతే అక్టోబర్ 31 వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా విడుదల అయిన క , లక్కీ భాస్కర్ , అమరన్ మూవీలు మాత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేశాయి. ప్రస్తుతం కూడా ఈ సినిమాలు మంచి హోల్డ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర కనబరుస్తున్నాయి. ఇక ఈ సినిమాలు ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేశాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన క సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ సినిమా ఇప్పటికే వంద కోట్లకి పైగా కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇక శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన అమరన్ అనే తమిళ డబ్బింగ్ సినిమా ఇప్పటికే 200 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: