ఇక ఈమె ఒక తెలుగులోనే కాకుండా తమిళం , కన్నడ , హిందీ , మలయాళం వంటి అన్ని భాషల్లో కలిపి 40 కి పైగా సినిమాల్లో నటించింది .. అయితే 2009 తర్వాత హఠాత్తుగా సినిమాల నుంచి మాయమైపోయింది. తెలుగులో ఆమె నటించిన ఆఖరి చిత్రం అప్పారావు డ్రైవింగ్ స్కూల్ 2004లోనే విడుదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లోనే జరిగిన కొన్ని ఘటనల వల్లే తెలుగు తెరకు మాళవిక దూరమైందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినిమాలకు దూరమైన మాళవిక 2007లో సురేశ్ మేనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత పెద్దగా బయటకు కనిపించని మాళవిక. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.. ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అదే అందంతో అందరికీ షాకిస్తుంది.. మరి ఈమె రాబోయే రోజుల్లో అయినా రీయంట్రీ ఇస్తుందో లేదో చూడాలి.