ఈ సినిమా ద్వారా రాజమౌళి మహేష్ బాబును ఓ కొత్త లుక్ లో చూపించడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.... సోషల్ మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తిస్థాయి అడ్వెంచర్స్ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ విషయం తెలిసి ఈ సినిమా మీద ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ నటి నవోమి స్కాట్ హీరోయిన్గా చేయనుందట.
ఇక దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా..... సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల ద్వారా కాకుండానే దేశంలోని పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏఎంబి సినిమాస్, హంబుల్ డ్రెస్సెస్ లో పార్ట్నర్ అయ్యారు. అంతేకాకుండా మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో నిర్మాతగా కూడా మారారు. ఇది మాత్రమే కాకుండా మహేష్ బాబు మరొక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారని వార్తలు సైతం వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ సోలార్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ట్రూజన్ సోలార్ (సన్ టెక్ లిమిటెడ్) తో కలిసి సౌర శక్తి వ్యాపార రంగంలోకి మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో అతను భారీగా పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు గ్రీన్ ఎనర్జీకి సూపర్ ఎనర్జీ తోడైతే ఇండియాలో సోలార్ పవర్ కి తిరుగు ఉండదని కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్తలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.