అంతేకాదు బాలయ్య లుక్స్ కూడా ఈ సినిమాలో హైలెట్ గా మారిపోతున్నాయి అని నిన్న రిలీజ్ అయిన వీడియో ఆధారంగా తెలిసిపోతుంది . బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క బీజీఎం బాగా వాయించాడు తమన్. కచ్చితంగా థియేటర్స్ లో బాలయ్య ఎంట్రీ సీన్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మొత మోగిపోవాల్సిందే అంటున్నారు జనాలు . అయితే ఈ సినిమా కథను బాబి ముందుగా టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో వెంకటేష్ కు వినిపించారట .
మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో వెంకటేష్ అస్సలు హిట్ కొట్టిందే లేదు . వరుసగా సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి . ఇలాంటి స్టోరీ ఆయనకు హిట్ ఇస్తుంది అంటూ భావించాడట బాబి. కానీ వెంకటేష్ ఈ చేయడానికి నో చెప్పాడట. వెంకటేష్ స్టోరీ విని నాకు ఇలాంటి స్టోరీ సెట్ కాదు అంటూ చేతులెత్తేసాడట. మొహమాటం లేకుండా నేను చేయను అని చెప్పేసాడట . అంతేకాదు ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు వేరే హీరోలకి కూడా ఈ కథ వినిపించాడట బాబి . ఫైనల్లీ బాలయ్య వద్దకు కథ చేరింది. ఎవరి ఖాతాలో ఎప్పుడు ఎలాంటి హిట్ పడాలో ఆ దేవుడు ముందే నిర్ణయిస్తాడు . అందుకే బాలయ్య ఖాతాలో ఇలాంటి హిట్ పడడానికి ఆయన వద్దకే అవకాశం చేరింది అంటున్నారు నందమూరి అభిమానులు. మొత్తానికి డాకు మహారాజ్ సినిమాతో మరొక క్రేజీ హిట్ బాలయ్య తన ఖాతాలో వేసుకోవడం పక్క అంటున్నారు జనాలు..!