కోలీవుడ్లో స్టార్ హీరోగా హీరోయిన్గా పేరుపొందిన ధనుష్ , నయనతార ఇద్దరు కూడా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా హీరో ధనుష్ పైన నయనతార తీవ్రమైన విమర్శలు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన రాబోయే డాక్యుమెంటరీ కి సంబంధించిన విషయంలో నయనతార ఇలా ధనుష్ పైన పలు రకాల సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం. నయనతార నటించిన నానుమ్ రౌడీ సీన్స్ పాటలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో నయనతార ఇలా ఫైర్ అయినట్లుగా సమాచారం.


నయనతార, తన భర్త డైరెక్టర్ విగ్నేష్ శివన్ 2002లో ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీగా రిలీజ్ చేయబోతున్నారు. ఎన్నో అడ్డంకులు ఎన్నో సమస్యలను దాటి మరి రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 18న స్ట్రిమింగ్ కి సిద్ధమైన సందర్భంగా ఇందుకు ఆలస్యం కావడానికి హీరో ధనుష్ కారణమని చెబుతూ ఆమె పలు రకాల విమర్శలు సైతం చేసింది. అంతేకాకుండా అభిమానులకు కనిపించే ధనుష్ వేరు అని అతని నిజ స్వరూపం ఇదే అంటూ ఆమె తెలియజేసింది.


ఫ్యాన్స్ కు సైతం సూక్తులు చెప్పే నువ్వు పాటించవా అంటూ నయనతార ఫైర్ అయ్యింది. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఒంటరి మహిళను నేను ఎన్నో సవాళ్లతో కూడిన చిత్ర పరిశ్రమకు కష్టపడి చిత్తశుద్ధితో పనిచేసే ఈ స్థాయికి చేరుకున్నాను.. నన్ను ప్రేమించే నా అభిమానులు , సినీ పరిశ్రమకు నా గురించి బాగా తెలుసు.. తండ్రి శ్రీ కస్తూరి రాజా సపోర్టుతో.. డైరెక్టర్ సెల్వ రాఘవ డైరెక్షన్లో మీరు సినీ ఇండస్ట్రీకి వచ్చి హీరోగా పేరు సంపాదించారు.. కానీ మీ చిల్లర పనులను మీరు అర్థం చేసుకొని సరిదిద్దుకోండి అంటూ తెలియజేసింది. తను నటించిన కొన్ని సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించుకునేందుకు చాలామంది అంగీకరించారు. కానీ మీరు మాత్రం అన్నిటిని బిజినెస్తోనే చూశారు అంటూ ఫైర్ అయ్యింది నయనతార. తన డాక్యుమెంటరీ రిలీజ్ కోసం ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారని వారికోసం నేను ఎందాకైనా వెళ్తానని.. మీ వ్యక్తిగత ద్వేషంతో చేసిన ఈ పనిని ఎలా ఒప్పుకోగలరు అంటూ ధనుష్ కు కౌంటర్ వేసింది నయనతార. అంతేకాకుండా 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని మీలాంటి వ్యక్తికి ఇది కరెక్టేనా అంటూ తెలియజేసింది నయనతార. మూడు రకాల పేపర్లతో ఒక లెటర్ ని రాసింది నయనతార. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: