నిత్యం సోషల్ మీడియాలో స్నేహారెడ్డి యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎప్పుడు ఏదో ఒక వెకేషన్ కి వెళుతూ అక్కడ ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన అన్ని విషయాలను స్నేహ రెడ్డి షేర్ చేసుకుంటుంది. ఈ మధ్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లను కూడా షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తోంది.
స్నేహ రెడ్డికి అల్లు అర్జున్ అంటే విపరీతమైన ప్రేమ. బన్నీకి ఎవరైనా దగ్గర అవుతున్నారు అంటే అసలు తట్టుకోదు. స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అల్లు అర్జున్ వివాహానికి ముందు స్నేహ రెడ్డిని కాకుండా శృతి అనే అమ్మాయిని లవ్ చేశారట. అయితే ఈ విషయాన్ని స్నేహ రెడ్డికి పెళ్లి తర్వాత చెప్పాడట. దాంతో స్నేహ కాస్త సీరియస్ అయిందట. ఆ తర్వాత ఇంకోసారి ఆ అమ్మాయితో మాట్లాడొద్దు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిందట. అప్పటినుంచి అల్లు అర్జున్ ఆ అమ్మాయితో మాట్లాడడం మానేసి స్నేహాని మాత్రమే ప్రేమించడం మొదలుపెట్టాడు.
ఇదిలా ఉండగా.... అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎడిటింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.