లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. అంతేకాదు... ఇటీవలే.. కల్కీ, సినిమాలో కూడా మెరిసింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని. అయితే.. అలాంటి బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని తండ్రిని కొందరు నేరగాళ్లు మోసం చేశారు. అతడిని నమ్మించి ఏకంగా రూ. 25 లక్షల రూపాయలను దోచేశారు.
అయితే చివరికి తాను మోసపోయానంటూ దిశా పటాని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.... దిశా తండ్రి జగదీష్ సింగ్ పటాని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ గా పదవి విరమణ చేశారు. అయితే విరమణ అనంతరం ప్రభుత్వ కమిషనర్ లో సీనియర్ పదవి ఇస్తానని కొందరు జగదీష్ ను సంప్రదించారు. అందుకోసం రూ. 25 లక్షలు చెల్లించాలని చెప్పారు.
ఏమీ ఆలోచించకుండా మొదట రూ. 5 లక్షల రూపాయల నగదు రూపంలో డబ్బుని ఇచ్చాడు. ఆ తర్వాత రూ. 20 లక్షల వరకు మూడు వేర్వేరు బ్యాంకు అకౌంట్ల నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత నిందితులు పరారీ అయ్యారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న జగదీష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కుటుంబానికి జరిగిన మోసం బయటపడింది.