షాజన్ పందసి ఆరెంజ్ చిత్రంలో కనిపించింది కొద్దిసేపు అయినా కూడా బాగానే క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాలలో నటించిన ఈ అమ్మడు ఎందుకో మళ్ళీ అవకాశాలు రాలేదు. తర్వాత టాలీవుడ్ కి దూరమైన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు తాజాగా అభిమానులకు సడన్ షాకిస్తూ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది. అయితే ఈ విషయం తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. ఉంగరాలు మార్చుకుంటూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. షాజన్ పందసి చేసుకోబోయే భర్త పేరు ఆసీస్ కనాకియ. ఈయన ఒక వ్యాపారవేత్త అన్నట్లుగా సమాచారం.
ఈ విషయం తెలిసిన అభిమానులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ జంటకు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మొదటి సారిగా 2009లో రాకెట్ సింగ్ అనే హిందీ సినిమా ద్వారా షాజన్ పందసి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతే ఆరంజ్ సినిమాలో అవకాశం వచ్చిందట. కేవలం తెలుగులో రెండు మూడు చిత్రాలలో నటించి సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు పలు రకాల టీవీ షోలు కూడా చేసిందట. వచ్చే ఏడాది ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.