అనంతరం మలయాళం, తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఆలయం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
కానీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఆ సినిమా అనంతరం కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ హనీ రోజ్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబుకు మరదలు పాత్రలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాతో హనీ రోజ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఓవైపు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఫిదా అయ్యేవారు. ఇదంతా పక్కన పెడితే హనీ రోజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హీరోపై ఇష్టాన్ని పెంచుకుందట. అంతేకాకుండా ఆ హీరోని వివాహం చేసుకోవాలని అనుకుంటుందట.
ఈ విషయాన్ని ఆ హీరోకి చెప్పగా అతడు ఇప్పటివరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదట. దీంతో హనీ రోజ్ ఇప్పటి వరకు ఆ హీరో మీద అలానే ఇష్టాన్ని పెంచుకొని తన ప్రైవేట్ పార్ట్ పైన హీరో టాటూ వేయించుకుందట. కానీ ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.