గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రేమించుకొని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి అక్కినేని ఇంటికి కోడలు కాబోతోంది త్వరలో ఎంగేజ్మెంట్ అవుతోందనే వార్తలు వినిపిస్తున్న సమయంలో మీనాక్షి చౌదరి ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని సుశాంత్, మీనాక్షి మంచి స్నేహితులని మీనాక్షి చౌదరి టీమ్ అయితే ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది.


అయితే మరొకసారి మీనాక్షి చౌదరి కూడా ఈ విషయం పైన స్పందిస్తూ "తాను ప్రస్తుతం సింగల్ గానే ఉన్నారని ఇప్పుడు అప్పుడు వివాహం చేసుకోవాలని ఆలోచన కూడా లేదని తనకు తన రిలేషన్షిప్ గురించి అప్ కమింగ్ ప్రాజెక్టల గురించి ప్రతి నెల రూమర్స్ రావడం చాలా కామన్ గా మారిపోయింది అంటూ మీనాక్షి చౌదరి వెల్లడించిందట". అయితే హీరోయిన్ తో పెళ్లి వార్తల పైన హీరో సుశాంత్ మాత్రం ఇప్పటివరకు ఏ విధంగా ఎక్కడ స్పందించలేదు.



సుశాంత్, మీనాక్షి చౌదరి 2021 లో మొదటిసారి ఇచట వాహనంలో నిలపరాదు అనే సినిమా ద్వారా నటించారు. ఈ సినిమాతోనే మీనాక్షి చౌదరి కూడా తెలుగుతెరకు పరిచయమయ్యింది. అయితే ఆమెకు అవకాశం ఎలా వచ్చింది అనే విషయం పైన కూడా ఇటీవలే అన్ స్టాపబుల్-4 లో తెలియజేసింది.. ముంబైలో యాక్టింగ్ స్కూల్లో సుశాంత్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నప్పుడు తనని చూసి అవకాశం ఇచ్చారని తెలిపింది. ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్ గా పనిచేశానని ఫెమినా మిస్ ఇండియా హర్యానా టైటిల్ని కూడా తాను గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తన అందంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మాత్రం అందరిని ఆకట్టుకుంది మీనాక్షి చౌదరి. మొత్తానికి ఎట్టకేలకు అక్కినేని ఇంటి కోడలు పైన క్లారిటీ ఇచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: