ధనుష్ నయనతార వివాదం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. 3 సెకన్ల వీడియోకు 10 కోట్ల రూపాయలు అడగడం విచారకరం అని నయనతార కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే నువ్వు, నీ భర్త చేసిందేంటి నయన్ అంటూ ప్రముఖ నిర్మాత సంచలన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. నయన్ తో పాటు నయన్ భర్తపై కూడా నిర్మాత వెల్లడించారు.
 
నయనతార ఏమైనా ఫ్రీగా నటిస్తున్నారా ఆమెకు ఫ్రీగా ఫుటేజీ ఎందుకివ్వాలని నిర్మాత ఎస్.ఎస్.కుమారన్ అన్నారు. నయన్ విఘ్నేష్ ఒకరిని తప్పు పట్టే ముందు తమ తప్పులు తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఫుటేజీ వాడుకున్నందుక్ ధనుష్ మీకు నోటీసులు పంపాడని మీ భర్త మాత్రం నేను రిజిష్టర్ చేసుకున్న ఎల్.ఐ.సీ టైటిల్ ను అప్పనంగా వాడేశాడని కుమారన్ తెలిపారు.
 
విఘ్నేష్ శివన్ ఎవరి ద్వారానో ఆ టైటిల్ ను అడిగిస్తే నేను ఒప్పుకోలేదని మరి దీన్నెలా సమర్థిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏం చేసుకుంటావో చేసుకో అని నా టైటిల్ వాడేశారని దీనికి ఎలా సమాధానం చెబుతారని కుమారన్ పేర్కొన్నారు. నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్నసలు లెక్క చేయలేదని కుమారన్ వెల్లడించారు. నేను ఎంత కుంగిపోయానో నాకు మాత్రమే తెలుసని చెప్పారు.
 
దారుణమైన ట్రెండ్ ను నయనతార, ఆమె భర్త ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం దారుణం అని కుమారన్ అన్నారు. కుమారన్ వ్యాఖ్యలను నెటిజన్లు సైతం సపోర్ట్ చేస్తున్నారు. కుమారన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కోర్టులో సైతం నయనతారకు షాకిచ్చేలా తీర్పు రావడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నయనతార తను చేస్తే రైట్ ఇతరులు చేస్తే తప్పు అనే విధంగా వ్యవహరిస్తోందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: