మహానటి మూవీ తో ఇండియా లోనే పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది నటి కీర్తి సురేష్.. మలయాళ నటి అయినప్పటికీ సౌత్ నార్త్ లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతుంది. ఇక ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పెళ్లి వార్తలు పై కూడా అప్పుడప్పుడు స్పందిస్తుంది. అయితే తాజాగా ఈమె పెళ్లి ఫిక్స్ అయినట్టు, డిసెంబర్లోనే కీర్తి సురేష్ పెళ్లాడబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కీర్తి సురేష్ ఇప్పటికే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని పెళ్లి చేసుకోబోతుందని, ఇండస్ట్రీ లో ఉన్న ఓ హీరో ని పెళ్లి చేసుకోబోతుందని, ఓ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందని ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ ఏది నిజం కాలేదు.

 అయితే తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అయినటువంటి పింక్ విల్లా తెలిపిన దాని ప్రకారం.. కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అయిందని, డిసెంబర్లోనే ఈమె పెళ్లి జరగబోతుందని వార్త కథనం రాసింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయేది ఎవరంటే.. కీర్తి సురేష్ తండ్రి తరఫున ఉన్న బంధువుల అబ్బాయిని కీర్తి సురేష్ పెళ్లాడబోతుందని, అలాగే వీరి పెళ్లి గోవా లో జరుగుతుందని, గోవా లో కీర్తి సురేష్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుందని తెలుస్తోంది.

 ఇక ఈ పెళ్లి లో ఫ్యామిలీ లోని అత్యంత సన్నిహితులతో పాటు కొంత మంది ఫ్రెండ్స్ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇక డిసెంబర్ లో జరగబోయే తన పెళ్లి కి సంబంధించి గుడ్ న్యూస్ ని కీర్తి సురేష్ టీం త్వరలోనే బయటపెడుతుందని పింక్ విల్లా రాసుకొచ్చింది. మరి పింక్ విల్లా రాసిన కథనం లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: