తాజాగా ఈ వీకెండ్ లో మంచి అంచనాలు ఉన్న రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఒకటి వరుణ్ తేజ్ నటించిన మట్కా.. రెండోది కంగువా. ఈ రెండు సినిమాలుకు వచ్చిన టాక్ ఏమంత గొప్పగా లేదు. కంగువాకు కాస్త వసూళ్లు బాగున్నాయి.. మట్కా సినిమాకు అది లేదు. సినిమా కథ‌ ఏంటి ?కథనాలు ఎలా ఉన్నాయి ? మేకింగ్ వాల్యూ సంగతి ఏంటి ? అనేది పక్కన పెడితే ఈ సినిమాల కోసం అటు సూర్య ఇటు వరుణ్ తేజ్ ఇద్దరు బాగా కష్టపడ్డారు. వరుణ్ తేజ్ గతంలో ఇప్పుడు లేనంత యాక్టివ్గా మట్కా కోసం ప్రమోషన్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మొత్తం తిరిగారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ఎగ్ర‌సివ్ గా మాట్లాడారు. తెరపై అంతకు పదింతలు కష్టపడ్డారు. తన మేకవర్ అదిరిపోయింది.. బాడీ లాంగ్వేజ్.. డైలాగ్స్ డెలివరీలో మార్పు కనిపించింది.. నటుడుగా ఎదిగాడు .. పాత్రని అర్థం చేసుకుని అందులో ఇమిడిపోయాడు.


అయితే సినిమాకు రిజ‌ల్ట్ బాగున్నప్పుడే ఈ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు .. మట్కా కు వచ్చిన టాక్ చాలా డిజాస్టర్ అని వచ్చింది .. కేవలం వరుణ్ తేజ్ నటనకు పడుతున్న మార్కులు చూసి మురిసిపోవటం తప్ప చేసేది ఏమీ లేదు. ఇక కంగువాకు మరింత కష్టతరమైన సమయం వచ్చింది. విడుదలకు ముందు ఈ సినిమాకు వచ్చిన హైప్‌ అంతా కాదు .. త‌మిళ‌ బాహుబలి అన్నారు .. తెలుగులో కూడా మామూలు స్పందన రాలేదు. తెరపై సూర్య ఎప్పటిలాగా కష్టపడ్డాడు.. నెలరోజులు ముందు నుంచి ప్రమోషన్లు చేశాడు.. నడిపించాడు.


తాను ఒక్కడే ప్రమోషన్ బాధ్యత భుజాన పై వేసుకునే ప్రపంచం అంతా తిరిగాడు .. కానీ తలా తోకాలేని కథ .. అర్థం లేని పాత్రలు .. లౌడ్ నటన వీటి మధ్య కంగువా నలిగిపోయింది . ఏం నమ్మి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారో .. ఇది చూస్తున్న సూర్య అంత కష్టపడ్డాడో ఎవరికి అర్థం కావడం లేదు. పార్ట్ 2 అంటున్నా ఆశ‌లు వదులుకోవటం మంచిదని చెన్నై వర్గాల టాక్. ఏది ఏమైనా అటు సూర్య .. ఇటు వరుణ్ ఇద్దరు ఈవారం ఫలితాలతో భంగపడ్డారు.. వాళ్ళ కష్టం వృధా అయింది. క‌థ ని ఎంచుకునేటప్పుడే ఒకటికి పది సార్లు ఆలోచించి ఉంటే ఈ భంగపాటు తప్పేదేమో అనుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: