నోరు మంచిదైతే ఊరు మంచిదే అవుతుందని అన్నారు పెద్దలు. విమర్శలందు మంచి విమర్శలు వేరు. చెడ్డ విమర్శలు వేరు. దేనికైనా సరే ఒక నిర్దిష్టమైన భాష పడితే చాలా హుందాగా ఉంటుంది. రాజకీయాల్లో విమర్శలు .. ప్రతి విమర్శలు అనేవి చాలా సహజంగా ఉంటాయి. అవతల వారికి నొప్పి అనిపించిన తీవ్రంగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇంత ఎందుకు ? నాన్న ఉన్నాడా అని అడగటానికి మీ అమ్మ మొగుడు ఉన్నాడా ? అని అడగడానికి చాలా తేడా ఉంది. ఆ తేడాను చాలామంది రాజకీయ నాయకులు గమనించలేకపోతున్నారు.. ఇక సినిమాలకు పదునైన సంభాషణలు అందించి మంచి నటుడు మంచి రచయిత అనిపించుకున్న పోసాని కృష్ణ మురళి కథ ఐదేళ్లుగా అనేక ప్రెస్మీట్లలో .. అందులో వాడిన ఏకవచనాలు.. తిట్లు .. దీవెనలు అన్నీ ఇప్పుడు ఆయనని చుట్టూ ముడుతున్నాయి.


కర్మ ఏ ఒక్కరిని వదలదు అన్నట్టుగా పోసాని చుట్టూ నీళ్లు చేరుతున్నాయి. ఆయనపై పక్కా ప్రణాళికతో ఏపీలో కేసులు మీద కేసులు పడుతున్నాయి. ఫిర్యాదులు మీద ఫిర్యాదులు వస్తున్నాయి. ముందుగా పోలీసుల నుంచి నోటీసులు అందుకోవటం .. ఆయా ఇళ్లకు వెళ్లి పోలీసులతో మాట్లాడి రావడం తప్పదు. మిగిలిన వారిలా రాత్రికి రాత్రి ఎత్తుకు రాకపోవచ్చు .. లేదా తొందరగా అరెస్టు చేయరు. కానీ ఆ దిశగా చర్యలు ఉండొచ్చు అనే క్లారిటీ కనిపిస్తోంది .. చంద్రబాబు నే అరెస్టు చేశారు. జగన్ ఇంకా చోటామోటా లీడర్లను టార్గెట్ చేసి పెద్ద మార్గం జగన్ చూపించారు.. ఇప్పుడు తెలుగుదేశం అదే బాటలో పయనిస్తుంది.


కాదని అనే హక్కు బాధపడే అవకాశం ఆవేదన వ్యక్తం చేసే వేదిక ఏది మిగలదు. అందువల్ల ఇప్పుడు కాకుండా త్వరలో అయినా పోసాని కృష్ణ మురళి కూడా అరెస్టు అయ్యే అవకాశం కనిపిస్తోంది. సరే బెయిలు వస్తుందా ? ఎన్ని రోజులు రిమోట్ లో ఉంటారు ? అన్నది తర్వాత విషయం. ఒకటి మాత్రం అందరూ అర్థం చేసుకోవాలి .. చేతిలో ఫోన్ ఉంది కదా ఎదురుగా మైక్ ఉంది కదా ? మనకు దేవుడు నోరు ఇచ్చాడు అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడితే కర్మ ఎవరిని వదలదు అనేందుకు ఇదే నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: