తల్లి చిరకాల కోరికను నెరవేర్చాలని భావించిన సందీప్ కిషన్ 80 లక్షల రూపాయల విలువ చేసే కారును బహుమతిగా ఇచ్చారని సమాచారం అందుతోంది. చిన్నప్పుడు తల్లి కోరిన కోరికను గుర్తుంచుకుని ఇప్పుడు సందీప్ కిషన్ ఆ కోరికను నెరవేర్చారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్ చేస్తూ ఈ హీరో కెరీర్ పరంగా బిజీగా ఉండటం గమనార్హం.
తల్లికి అపురూపమైన బహుమతిని ఇచ్చిన విషయాన్ని చెబుతూ సందీప్ కిషన్ తెగ మురిసిపోయారని తెలుస్తోంది. తల్లికి ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడం గురించి సందీప్ మాట్లాడుతూ మా అమ్మకు పుట్టినరోజు బహుమతిని ముందుగానే ఇస్తున్నానని అన్నారు. అమ్మ ఆలిండియా రేడియోలో జాబ్ చేయడానికి ఇప్పటికీ సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారని సందీప్ కిషన్ అన్నారు.
నేను బాల్యంలో ఉన్న సమయంలో కారు కొనివ్వాలని అమ్మ అడిగారని ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చానని సందీప్ పేర్కొన్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. మజాకా సినిమా సంక్రాంతి రేసులో నిలవగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సందీప్ కిషన్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. సందీప్ కిషన్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సందీప్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.