అయితే పవన్ కళ్యాణ్ కథ వినగానే "వద్దురా బాబు ఈ సినిమా చేస్తే ఓవర్ అనుకుంటారు " అని భయపడిన మూవీ మాత్రం ఒకే ఒక్కటి . ఆ ఒక్క సినిమా మరేంటో కాదు "గోపాల గోపాల". వెంకటేష్ హీరోగా శ్రేయ శరణ్ హీరోయిన్గా.. పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్ పాత్రలో కనిపించిన ఈ సినిమాను కిషోర్ కుమార్ డైరెక్షన్ వహించారు . ఈ సినిమాపై అభిమానులు బాగానే ఎంజాయ్ చేశారు. 2015 లో రిలీజ్ అయిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ నటనను మరో మెట్టు ఎక్కేలా చేసింది .
అప్పటివరకు టూ రొమాంటిక్ లవర్ బాయ్ లుక్స్ లోనే కనిపించిన పవన్ కళ్యాణ్ కు గోపాల గోపాల సినిమా స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కేలా చేసింది . ఈ సినిమాలో ఆయన ఏకంగా దేవుడి పాత్రలో కనిపించాడు . మరి ముఖ్యంగా ఈ సినిమా స్టోరీని పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ చెప్పినప్పుడు "నన్ను దేవుడిగా చూపిస్తారా..? మరి ఓవర్గా ఉంటుంది ఏమో" అంటూ వద్దన్నారట . కానీ ఆ తర్వాత అందరూ నచ్చజెప్పడంతో ఆ సినిమాకు ఓకే చేశారట . సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలతో మరొక పక్క సినిమాల తో బిజీగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏ పి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ మరింత స్థాయిలో చురుగ్గా ముందుకు వెళ్తున్నారు . అన్యాయం అన్న పదం లేకుండా ఏపీని మార్చేయాలి అన్న విధంగా ట్రై చేస్తున్నారు..!