సినిమా ఇండస్ట్రీ అంటే చప్పట్లు ..ప్రశంసలు ..పూలమాలలు కాదు. అవమానాలు.. చీదరింపలు ..దారుణాతి దారుణమైన మాటలు కూడా ఉంటాయి.  అలాంటివన్నీ భరిస్తేనే ఇండస్ట్రీలో ఒక స్థాయిని అందుకోగలరు . అలా చాలా మంది ప్రూవ్ చేశారు. అయితే స్టార్ సెలబ్రిటీస్ పరిస్థితి వేరు . తాతల పేర్లు తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన హీరోస్ అందరూ కూడా ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయాలని లేదు . కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇంట్రెస్ట్ లోకి వచ్చి స్వయంకృషితో ఎదగాలి అనుకున్న ప్రతి ఒక్క హీరోకి ఇలాంటి  అవమానాలు తప్పవు.


అంత ఎందుకు.. మెగాస్టార్ లాంటి చిరంజీవిని కూడా కెరియర్ స్టార్టింగ్ లో చాలామంది డైరెక్టర్స్  అవమానించారు . ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్నాక మెగాస్టార్ గా మారాకే ఆ డైరెక్టర్స్ మళ్ళీ వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అయితే చిరంజీవిలాగే చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక స్టార్ హీరో ఇండస్ట్రీ లోకి వచ్చాడు. ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది . ఎంతలా అంటే సహజ సిద్ధంగా ఉంటుంది. తెర పై ఆయన నటిస్తే కన్నీళ్లు కన్ ఫామ్.  ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుని  అవార్డులు కూడా తీసుకున్నారు.



ఇంకా పక్కాగా చెప్పాలి అంటే పాన్  ఇండియా స్టార్స్ కి కూడా తన సినిమాలతో కాంపిటీషన్ ఇస్తున్నాడు . అయితే కెరియర్ స్టార్టింగ్ లో ఈ హీరో డైరెక్టర్ ల వద్దకు అవకాశం కోసం వెళితే చాలా దారుణంగా అవమానించారట. "నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా? నీకు అసలు హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయా..?" అంటూ దారుణంగా మాట్లాడారట . అయితే ఆ తర్వాత మాత్రం ఆ హీరో ఎక్కడా కూడా డిసపాయింట్ అవ్వకుండా చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఒక్కొక్కొ మెట్టు ఎదుగుతూ పైకి వచ్చాడట . ఇప్పుడు ఆ హీరో పాన్ ఇండియా హీరోస్ కి కూడా కాంపిటీషన్ ఇస్తున్నాడు. కొంతమంది బడా డైరెక్టర్లు ఆయన కాల్ షీట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: