మరి ముఖ్యంగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తుంది . మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ సినిమాను కూడా ఆమె రిజెక్ట్ చేసింది అంటే ఆమె ఎంత గట్స్ గల హీరోయిన్ అనే విషయం అర్థం చేసుకోవచ్చు . కాగా సాయి పల్లవి రీసెంట్గా అమరన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా ఆమెకు మంచి బూస్టప్ ఇచ్చింది. అయితే సాయి పల్లవి పై అమరన్ సినిమా తర్వాత సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వచ్చాయి. సాయి పల్లవి హెడ్ వెయిట్ పెరిగిపోయింది అని ..అమరన్ సినిమా హిట్ తో ఆమె కళ్ళు నెత్తికెక్కాయి అని చాలా దారుణ్మగా ట్రోల్ చేశారు.
ఇప్పుడు డైరెక్టర్లకి ఆమె కొత్త కండిషన్స్ కూడా పెడుతుంది అని చాలా రకాల వార్తలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సాయి పల్లవి కి సంబంధించిన మరొక వార్త బాగా హాట్ గా ట్రెండ్ అవుతూ ఆమె పరువు తీసేలా చేస్తుంది. సాయి పల్లవి డబ్బు మనిషి కాదు.. సినిమా ఫ్లాప్ అయితే ఆమె రెమ్యూనరేషన్ ని కూడా వెనక్కి ఇచ్చేస్తుంది అన్న వార్తలు ఎన్నో విన్నాము. అయితే ఫర్ ద ఫస్ట్ టైం సాయి పల్లవి తన కెరియర్లో ఒక సినిమా కోసం రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. బాలీవుడ్ రామాయణ సినిమా కోసం ఆమె ఏకంగా ఎనిమిది కోట్లు ఛార్జ్ చేసిందట. ఇది సెకండ్ పార్ట్ కోసం అట. మొదట పార్ట్ కి 4 కోట్లు తీసుకుందట. నిజానికి సాయి పల్లవి అమరన్ సినిమా కంటే ముందు వరకు కూడా రెండు కోట్ల మూడు కోట్లు తీసుకుంటూ వచ్చింది. అయితే బాలీవుడ్ రామయణ పార్ట్ 2 కి మాత్రం ఏకంగా 8 కోట్లు ఛార్జ్ చేస్తుందట . దీంతో సాయి పల్లవి పేరు మారుమ్రోగిపోతుంది . సాయి పల్లవి కూడా డబ్బు మనిషి ..ఇండస్ట్రీలో కొన్ని హిట్స్ పడితే ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది అంటూ జనాలు దారుణంగా మాట్లాడుకుంటున్నారు..!