ఆ విషయం అందరికీ తెలిసిందే. తారక్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. నచ్చితే నచ్చింది అని చెప్తాడు .. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాడు. ఉన్న విషయాన్ని ముఖాన్నే మాట్లాడేసేయడం తారక్ దగ్గర నుంచి వచ్చింది . అయితే తారక్ కొన్ని కొన్ని సెంటిమెంట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాడట. అయితే ఈ మధ్యకాలంలో జనాలు యువత ఏ సెంటిమెంట్స్ కూడా ఫాలో అవ్వడం లేదు . పెద్దలు చెప్పిన విషయాని అస్సలు పట్టించుకోవడం లేదు. అది అందరికీ తెలుసు . కోట్ల ఆస్తి ఉన్న కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తారక్ మాత్రం కొన్ని కొన్ని చిన్న సెంటిమెంట్స్ కూడా బాగా ఫాలో అవుతూ ఉంటాడట .
మరి ముఖ్యంగా అది తన తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నారట . సినిమా షూట్ కి కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే మళ్ళీ ఇంట్లోకి వెళ్లి కాసేపు కూర్చొని మంచినీళ్లు తాగి నాన్న ఫోటోకి దండం పెట్టుకుని బయటకు వస్తాడట. అంతేకాదు తారక్ కి మరొక సెంటిమెంట్ కూడా ఉందట . తారక్ ఇంటి వద్ద ఏదైనా కాకి వచ్చి అరుస్తున్నప్పుడు.. అది తన పితృదేవతలతో సమానం అంటూ ఆ కాకికి ఫుడ్ పెడుతూ ఉంటారట. సాధారణంగా సామాన్య జనాలు ఇలా చేస్తూ ఉంటారు . పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ ఏమాత్రం పట్టించుకోరు . కానీ తారక్ కి పాన్ ఇండియా లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా..ఈ హీరో ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాడు అని తెలిసి జనాల షాక్ అయిపోతున్నారు. మరి కొందరు ఆయన కూడా మనిషేగా అంటుంటే మరికొందరు వెరీ ఫన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!