పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మట్కా సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమా డిజాస్టర్లతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని గ్యాంగ్ స్టార్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఈ సినిమా కథ విషయానికొస్తే జూద సామ్రాజ్యం నేపథ్యంలో సాగే అద్భుతమైన కథాంశం. ఈ సినిమాలో 1970-1980 మధ్యకాలంలో విశాఖపట్నంలోని సామాజిక ఆర్థిక వ్యవస్థను చూపించే ప్రయత్నాన్ని చేశారు.
కానీ ఈ సినిమా కూడా విఫలమైంది. మొదటిరోజు మొదటి ఆటతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ డిజాస్టర్ ప్రభావం సినిమా వసూళ్ల పైన భారీగా పడింది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో రూ. 1.10 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం అందుతుంది. ఈ సినిమా విడుదలకు ముందు రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా బ్రేక్ ఈవెన్ రావాలంటే కష్టమే.. ఎందుకంటే మరో రూ. 19 కోట్లు రావాలని అంటున్నారు.
అయితే వరుణ్ తేజ్ వివాహం చేసుకొని సరిగ్గా సంవత్సరం అవుతుంది. లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న తర్వాతే వరుణ్ తేజ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది వరుణ్ తేజ్ కు లావణ్య రాకతోనే అదృష్టం కలిసి రావట్లేదేమోనంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుణ్ తేజ్ నటించే తదుపరి సినిమాలు అయినా మంచి సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.