విజయ్ దేవరకొండ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన టాలెంట్ తో స్టార్ హీరోగా నిలిచారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్నాచితక పాత్రలు చేసి ప్రేక్షకులను అల్లరించారు. అనంతరం పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాతో మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తన సినిమాలతో కన్నా తన యాటిట్యూడ్ తోనే ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా సమయంలో ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కొన్నాడు. కానీ ఏ మాత్రం వెనుతిరగకుండా స్ట్రాంగ్ గా నిలబడి ట్రోల్స్ చేసిన వారందరి మీద కౌంటర్లు వేశాడు.


అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే సక్సెస్ అందించిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో విజయ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండకు పెద్దగా సక్సెస్ రావడం లేదు. చివరిగా విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా సక్సెస్ కాలేదు. ఈ తరుణంలోనే విజయ్ దేవరకొండ గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో విజయ్ నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఆ నాలుగు సినిమాలు కనుక విజయ్ దేవరకొండ చేసి ఉంటే తన కెరీర్ మంచి రేంజ్ లో ఉండేదని స్టార్ హీరోగా తన ఫామ్ కొనసాగేదని అంటున్నారు. హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను ముందుగా విజయ్ దేవరకొండను చేయమని పూరి జగన్నాథ్ తన చుట్టూ తిరిగాడట. కానీ విజయ్సినిమా కథ నచ్చలేదని రిజెక్ట్ చేశారట. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే ఉప్పెన సినిమాను మొదటగా బుచ్చిబాబు విజయ్ దేవరకొండతో చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ విజయ్ అసలు ఒప్పుకోలేదట. అనంతరం వైష్ణవి వైష్ణవ్ తేజ్ వద్దకు వెళ్లి ఈ సినిమా కథను చెప్పగానే వెంటనే వైష్ణవ్ తేజ్ ఒప్పేసుకుని ఈ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు.


ఇక అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాను కూడా విజయ్ దేవరకొండనే చేయమని సందీప్ రెడ్డి ఎంతో ప్రయత్నం చేశాడట. కానీ విజయ్ అసలు చేయనని చెప్పాడట. షాహిద్ కపూర్సినిమా చేసి మంచి సక్సెస్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాకు విజయ్ దేవరకొండ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుందని అజయ్ భూపతి చాలా ట్రై చేశారట. కానీ ఆ సినిమాను కూడా విజయ్ దేవరకొండ సున్నితంగా రిజెక్ట్ చేశాడట. ఇక ఈ విషయం తెలిసి విజయ్ దేవరకొండ అభిమానులు ఈ నాలుగు సినిమాలు కనుక విజయ్ చేసి ఉంటే మంచి ఫామ్ లో ఉండేవాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నాలుగు సినిమాలు ఇండస్ట్రీలోనే మంచి సక్సెస్ కొట్టిన సినిమాలుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: