పాకిస్తాన్ న‌టి మెహ్విష్ హయత్ ఓ ఇంటర్వ్యూలో  తన కాబోయే పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది .. అందులో భాగంగా తన ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి సిద్ధం గా ఉన్నట్లు చెప్పుకొచ్చింది . అలాగే తన ఇంట్లో వారు కూడా తన పెళ్లి కి తొందర పెడుతున్నార ని దాంతో త్వరలో నే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు మెహ్విష్ హయత్‌ చెప్పుకొచ్చింది . అయితే తనని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండా లో అనే విషయాల పై ఈ ముద్దుగుమ్మ స్పందిస్తూ ముందు గా తన కుటుంబ సభ్యుల్ని అర్థం చేసుకొని సులభంగా అందరి తో కలిసి పోయే వ్యక్తిత్వం ఉండాల ని , అలాగే మనుషుల తో ప్రేమగా మెలిగే మనసు అతని లో ఉండాల ని ఆమె చెప్పుకు వచ్చింది .


పాకిస్తాన్ హీరోయిన్ 2019 లో అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం తో ప్రేమలో పడి అతని తో డేటింగ్ చేసినట్లు వార్త లు కూడా వచ్చాయి .  దావూద్ ఇబ్రహీం మెహ్విష్ హయాతేను ఐటెం సాంగ్‌లో చూసి ఆమెపై ఆకర్షితుడయ్యాడని కూడా అంటారు . అంతే కాకుండా త్వరలో నే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నార ని అప్పుట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి . అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ పెళ్లి కోసం వరుడి ని  వెతుకుతున్నాన ని చెప్పడం తో మరోసారి ఆమె సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది . ఈ విషయం ఇలా ఉండ గా మెహ్విష్ హయత్‌ గత ఏడాది పాకిస్థానీ డైరెక్టర్ నబీల్ ఖురేషి డైరెక్ట్ చేసిన తేరి మేరి కహానీయాన్ అనే సినిమా లో హీరోయిన్ గా నటించింది . ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీ గా ఉండటంతో కొత్త సినిమాల సమాచారం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: