చిత్ర పరిశ్రమ అంటేనే ఓ రంగుల ప్రపంచం ... ఇందులో హీరోయిన్‌గా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటిమనులు చాలామంది ఉంటారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ఒకప్పుడు బుల్లితెరపై సత్తా చాటిన వారే. బుల్లుతరపై వచ్చే సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై  ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుంటారు. అంతకంటే ముందే బుల్లితెరపై సీరియల్స్ లో కీలక పాత్రలో నటించి తమకంటూ ఓ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు .. అలా వచ్చిన ఇమేజ్ తో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడో దేశం లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ నటి ఎవరుంటే అందరూ నయనతార , సమంత అనుకుంటారు .. కానీ వారందరి కంటే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటూ తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషల్లోనూ ఆ  నటి నటిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు .. సీరియల్ నటి శ్వేతా తివారి.


బాలీవుడ్లో ఎంతో ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్స్ లో ‘కసౌటి జిందగీ కె’ సీరియల్లో శ్వేత తివారి ప్రధాన పాత్రలో నటించింది .. ఇందులో ప్రేరణ శర్మ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది . ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. బుల్లితెర పై ఈ సీరియల్ దాదాపు 7 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా సాగింది . ఆ తర్వాత బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 4లో కూడా పాల్గొంది అందులో విజేతగా నిలవడంతో పాటు ఈ బ్యూటీ కి మరింత క్రేజ్‌ వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా వ‌రుస అవకాశాలతో దూసుకుపోయింది.


ఇక ఈమె సినిమా జీవితం ఎంతో విజయవంతంగా సాగినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. రెండుసార్లు ప్రేమలో మోసపోయింది.. శ్వేతా తివారి 1998లో నటుడు రాజా చౌదరిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి పాలక్ తివారి జన్మించింది. అయితే మనస్పర్థల కారణంగా 2007లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో అభినవ్ కోహ్లీని పెళ్లి చేసుకుంది. వీరికి రేయాన్ష్ కోహ్లీ జన్మించారు. తన భర్త గృహ హింసకు పాల్పడుతున్నడాని 2019లో కోర్టును ఆశ్రయించగా.. అదే ఏడాది విడాకులు తీసుకున్నారు. నివేదికల ప్రకారం శ్వేతా తివారీ ఆస్తులు రూ.81 కోట్లు అని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: