ఇక మోనాల్ చదువుకునే రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి .. హిందు తో పాటు తమిళం తెలుగు సినిమాల్లో నటించింది . కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇక సినిమాల్లో ఎదుగుతున్న సమయంలోనే కోలీవుడ్ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి చట్టపట్టలేసుకుని తిరిగారు. ఆల ఆమెతో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి చివరకు సిమ్రాన్ చెల్లెను వదిలేసాడు. ఆమె నన్ను ఎందుకు దూరం పెడుతున్నావని అడిగినా కూడా అతను సమాధానం చెప్పలేదు.
తాను ఎంతగానో నమ్మి ప్రేమించిన వ్యక్తి తనను మోసం చేయడం తో మోనల్ తట్టుకోలేక అతి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏప్రిల్ 14 2002లో తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. మోనాల్ చనిపోయిన తర్వాత ఆ కొరియోగ్రాఫర్ ఎవర అని ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఆ వ్యక్తి ప్రసన్న సుజిత్ అని తెలిసింది. కానీ సుజిత్ మాత్రం ఈ విషయంపై ఎప్పుడూ నోరుమెదపలేదు. ఇంకా ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒక మంచి హీరోయిన్ ని మాత్రం మనం అందరం మిస్ అయ్యాము .