అంతే కాదు నయన్-ధనుష్ ల మధ్య పాత పగలు కూడా ఉన్నాయట . ఆ కారణంగానే వీళ్లిద్దరు ఈ విధంగా ఇప్పుడు ఆ పాత పగను కక్షను బయటపెడుతున్నారు అంటూ పలు రకాల వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. అయితే నయనతార పెట్టిన ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ధనుష్ పై తీవ్ర వ్యతిరేకతను చూపిస్తుంది. పలువురు హీరోయిన్స్ కూడా నయనతారకు సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం.
దీంతో నయనతార అంతు చూడడానికి మాజీ భార్య ఐశ్వర్య రంగంలోకి దిగినట్లు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . లీగల్ గా ప్రొసీడ్ అవుతూ ధనుష్ భార్య ఐశ్వర్య నయనతారపై సీరియస్ యాక్షన్ తీసుకునే విధంగా పక్కాగా ముందుకు వెళుతుందట. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . అయితే మరి కొంత మంది మాత్రం నయనతారని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు . 10 కోట్లు ధనుష్ కి ఎక్కువ కాదు.. కావాలనే ఆయన మనసులో ఏదో పగ పెట్టుకొని ఇలా చేస్తున్నాడు అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు . మొత్తానికి ధనుష్ తన పేరుని ..తనకు ఉన్న పరువుని సర్వనాశనం చేసుకున్నాడు అనడంలో సందేహమే లేదు..!