అయితే వీళ్ళ పెళ్లి డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న.. ఎక్కడ దానికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ మాత్రం బయటకు రాలేదు. అటు నాగార్జున ఫ్యామిలీ ఇటు శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ ఎక్కడ కూడా పెళ్లి డేట్ ను రివిల్ చేయకపోవడం గమనార్హం . గుట్ట చప్పుడు కాకుండా పెళ్లి చేస్తున్నారా..? లేకపోతే పెళ్లి డేట్ మార్చుకున్నారా..? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది . సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు నాగచైతన్య - శోభిత ల పెళ్లికి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య -శోభిత వెడ్డింగ్ కార్డ్ వైరల్ గా మారింది . హైలైట్ ఏంటంటే ఈ వెడ్డింగ్ కార్డులో అంతా బాగానే ఉన్నప్పటికీ పెళ్లి ముహూర్తం మాత్రం అసలు మెన్షన్ చేయలేదు . దీన్నిబట్టి అర్థం అయిపోతుంది ఇది అక్కినేని ఫ్యామిలీ రిలీజ్ చేసిన పెళ్లి కార్డు కాదు అని.. ఎవరో కొందరు ఆకతాయలు పనీపాటా లేకుండా చేసిన పనినే అని..అయితే ఈ వెడ్డింగ్ కార్డ్ పై పలువురు అక్కినేని హెటర్స్ ఘాటుగా స్పందిస్తూ ఉండడం అక్కినేని అభిమానులకు మండిపోయేలా చేసింది . అంతేకాదు అక్కినేని అభిమానులు సైతం ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు . ఇలాంటి పనులు చేస్తున్నారు నాశనం అయిపోతారు అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్న వారికి శాపనార్ధలు పెడుతున్నారు. మొత్తానికి నాగచైతన్య - శోభిత ల పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది..!