సాధారణంగా పెళ్లి పత్రిక రాసేటప్పుడు వధువు తల్లిదండ్రుల పేరులను ..వరుడు తల్లిదండ్రుల పేరులను రాస్తూ ఉంటారు.  చివర్లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు  స్పెషల్ గా ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా రాసుకోస్తూ ఉంటారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నాగచైతన్య వెడ్డింగ్ కార్డ్ పై హ్యూజ్ ట్రోల్లింగ్ జరుగుతుంది . నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు . అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఒక పెళ్లి కార్డు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .


నాగచైతన్య పెళ్లి కార్డు ఇదే అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.  మరీ ముఖ్యంగా ఈ పెళ్లి కార్డులో శోభితా ధూళిపాళ్ల  తల్లిదండ్రుల పేర్లు అదే విధంగా నాగచైతన్య తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి . అయితే నాగచైతన్య తల్లిదండ్రుల పేర్లు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి . అక్కినేని నాగార్జున - అమల అంటూ రాయడంతో పాటు నాగార్జున మొదటి భార్య లక్ష్మి ఆయన భర్త పేరు కూడా రాయడం వెరైటీగా అనిపించింది.



దీనితో నాగచైతన్యను కావాలనే ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.  నీలా ప్రపంచంలో ఎవరి పెళ్లి పత్రిక ఉండదేమో బ్రో అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . మనకు తెలిసిందే నాగచైతన్య తండ్రి నాగార్జున తల్లి లక్ష్మి వీళ్ళు పెళ్లయిన కొంతకాలానికే విడిపోయారు . ఆ తర్వాత లక్ష్మీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది .  అమలను నాగార్జున పెళ్లి చేసుకున్నాడు . ఇప్పుడు ఆ తలనొప్పి  నాగచైతన్య పెళ్లి పత్రికల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయేలా చేసింది అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పెళ్లి కార్డ్ అఫిషియల్ కాదు అంటూ తెలుస్తుంది. ఇది ఫేక్ పెళ్లి కార్డ్ అంటున్నారు అక్కినేని అభిమానులు.  చూడాలి దీని పై నాగ్ ఎలా స్పందిస్తారో..??

మరింత సమాచారం తెలుసుకోండి: