స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా .. టాలీవుడ్ లో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది .. మొదటి సినిమా తోనే తెలుగు లో డిజాస్టర్ అందుకుంది .. ఇక దాంతో తమన్నా కి తెలుగులో సినిమా అవకాశాలు రావనుకున్నారు .. కానీ ఎవరూ ఊహించని విధంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది .


అదే సమయంలో శేఖర్ కమ్ములకి తమన్నా గురించి చిత్ర పరిశ్రమ లో కొందరు చెప్పారు .. దాంతో ఆయన ఆమె  నటించిన శ్రీ సినిమా ను చూశాడు . ఆ సినిమా ఫ్లాప్ అయిన అందులో తమన్నా నటన ఆయనకు బాగా నచ్చింది. హ్యాపీ డేస్ లో వరుణ్ సందేశ్ కు జంటగా తమన్నా ఫర్ఫెక్ట్ అని ఆమె ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశాడు . ఇక దాంతో ఆయన టీం తమన్నాను పిలిపించి హ్యాపీ డేస్ మూవీ స్టోరీ కూడా చెప్పారు. స్టోరీ మొత్తం విన్న తమన్నా ఎగిరి గంతేసేంది. ఆస‌లు ఇలాంటి సినిమా ఆఫర్ అంటే అసలు వదులుకోకూడదని అనుకుంది.


పైగా హ్యాపీడేస్ సినిమా కోసం నెలరోజులు ఆయన ఆఫీసు లోనే ఉండాలని కూడా అన్నారు .. అన్నిటికీ ఒప్పుకున్న తమన్నా ఒక సీన్ లో మాత్రం చిరిగిన జాకెట్ వేసుకుని చంకల కింద చూపించాలంటే మాత్రం నో అన్నట్లుగా చెప్పిందట .కానీ, శేఖర్ కమ్ముల కథ లో ఆ సీన్ చాలా ఇంపార్టెంట్ అని మరీ వల్గర్ గా చూపించనని సీన్ షూట్ అయ్యాక చూసుకో ఒకవేళ నీకు ఇబ్బంది గా అనిపిస్తే మార్చేద్దాం లేదంటే ఆ సీన్ తీసేద్దాం .. కానీ , ఆ సీన్ మాత్రం చేయాల్సిందే . అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారట . ఇక దాంతో కన్విన్స్ అయ‌న త‌మ‌న్నా తర్వాత ఏ హీరోయిన్ అయినా నో అంటుందా..అది కూడా తమన్నా లాంటి అప్‌కమింగ్ హీరోయిన్. ఓకే అనింది. ఆ తర్వాత సినిమాలో ఆ సీన్ బాగా వచ్చిందని హ్యాపీగా ఫీలైందట .

మరింత సమాచారం తెలుసుకోండి: