సూపర్ స్టార్ కృష్ణ , మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవరు అందుకొని శిఖరాలు అందుకుని మోస్ట్ పాపులర్ , టాలెంటెడ్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు . ఈ ఇద్దరు ఎన్నో పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి ఎందరో మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు . ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్నారు. చిరంజీవి కంటే ముందే సూపర్ స్టార్ అయిన కృష్ణ .. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ సినిమాని కూడా నిర్మించారన్న విషయం చాలా మందికి తెలియదు .. ఇంతకీ ఆ సినిమా ఏంటి అనేది ఇక్కడ చూద్దాం.


ఇక ఇక ఆ సినిమా ఆశామాషి మూవీ కాదు .. తెలుగు చిత్ర పరిశ్రమనే కొత్త పుంతలు తొక్కించిన సినిమా .. ఆ సినిమా మరేదో కాదు మెగాస్టార్ నటించిన ఖైదీ .. 1983లో విడుదలైన ఈ సినిమాను సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాల్లో చిరంజీవి జైలు నుంచి తప్పించుకుని స్మగ్లర్ ముఠాలపై పోరాటంలో పాల్గొన్న ఖైదీగా నటించాడ .. ఈ సినిమాలో చిరంజీవి బ్రేక్ డాన్స్ లు , ఫైట్లు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . అలాగే చిరంజీవికి ఇది తొలి కమర్షియల్ హిట్‌ కూడా కావటమే కాకుండా స్టార్ హీరోగా మార్చింది.


అయితే ఖైదీ తెలుగులోనే కాకుండా.. 1984లో హిందీలో కూడా ఖైదీగా రీమిక్ అయింది.. హిందీలో ఈ సినిమాకు నిర్మాతిగా వ్యవహరించింది మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ .. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమాని బాలీవుడ్లో నిర్మించాడు. హిందీ వెర్షన్ లో చిరంజీవి పాత్రను జితేంద్ర పోషించగా.. మాధవి హీరోయిన్ గా నటించింది . సుమలత పాత్రను హేమమాలిని పోషించగా, రంగనాథ్ గా శత్రుఘ్నసిన్హా నటించారు . పోలీస్ ఆఫీసర్ గా శత్రుఘ్నసిన్హా కనిపించాడు . రావుగోపాలరావు విలన్ పాత్రను , ఖాదిర్ ఖాన్ పోషించాడు. ఎస్.ఎస్.రవిచంద్ర దర్శ కత్వంలో బాలీవుడ్‌లో వ‌చ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ కృష్ణకు నిర్మాత గా ఎంతో పేరు తెచ్చిపెట్టింది ఖైదీ మూవీ .

మరింత సమాచారం తెలుసుకోండి: