గత కొన్ని నెలలుగా బయోపిక్స్ ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఇండియన్ ఫిలిమ్స్ కూడా ఇందులో విడుదల అయ్యి బాగానే ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఫలానా వారి బయోపిక్ అని పేరు మెన్షన్ చేయకుండానే వారి యొక్క రూపు రేఖలు మ్యాచ్ అయ్యేలా చూపించి, పలు జాగ్రత్తలతో వివాదాస్పదం లేకుండా తీసినటువంటి సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. 2010కి ముందు అధికారిక బయోపిక్స్ కన్నా అనధికారికంగా బయోపిక్స్ చాలా ఎక్కువగా విడుదలయ్యాయి.

ప్రస్తుతం.. కాలం మారుతున్న కొద్దీ చాలానే బయోపిక్స్ విడుదలవుతున్నాయి. కొన్ని నిజ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధారాలను చూపిస్తూ. సినిమాలు గా తీస్తున్నారు. ఇండియన్ ఫిలిమ్స్ ఇండస్ట్రీ ఆలస్యంగా  ఇలాంటి రూట్ పట్టినప్పటికీ కూడా.. అన్ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా దక్షిణాది మూవీ మేకర్స్ తీస్తున్న బయోపిక్స్ కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. కానీ బాలీవుడ్ బయోపిక్స్ మాత్రం పెద్దగా ఆసక్తి కలిగించలేకపోతున్నాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కలెక్షన్స్ ఈ సినిమాల పై ప్రభావాన్ని సూచిస్తాయి అంటే బాలీవుడ్ బయోపిక్స్ కూడా వెనుకబడి పోతున్నాయట.సౌత్ నుంచి మాత్రం మంచి బయోపిక్ లు విడుదలవుతూ ఉన్నాయి.

1). ఆడు జీవితం
మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మలయాళ వలస కార్మికుడు కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించారు. ఇందులో ఆయన మేకోవర్ కూడా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించేలా ఉంది.

2). అమరన్:
తమిళ సినిమా అయినా ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దక్షిణాది సైనికుల జీవితాలు యుద్ధంలో ఎలా ముగిసాయి అనే కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇందులో శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించారు.


3). మంజుమ్మెల్ బాయ్స్:
కొన్ని ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. మలయాళం లో తెరకెక్కిన బెస్ట్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఒక చిన్న పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తీసి బెస్ట్ గా నిలిచింది. ఆ తర్వాత ఇలాంటి సినిమాలు ఎన్నో రావడం ఇతర భాషలలో కూడా కనిపిస్తోంది.



4). ఆకాశమే నీ హద్దురా:
సూర్య ప్రధాన పాత్రలో ఎయిర్ డెక్కన్ జీఆర్ గోపీనాథ్ బయోపిక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు,  తమిళ భాషలలో హిట్ టాక్ తో ప్రశంసలు అందుకుంది..


5). కురుప్:
ఒక కామన్ మ్యాన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక నేరగాడి జీవిత కథలో దుల్కర్ సల్మాన్ నటించారు. అలాగే ఇందులో క్రైమ్ కథ కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయినా కేరళ పరంగా హిట్ అయింది.


6). మహానటి:
దక్షిణాదిన  బయోపిక్ గా వచ్చి.. బయోపిక్స్ పై ఆసక్తి రేపిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది.  దీని తర్వాతే ఎన్నో బయోపిక్ లు కూడా వచ్చాయి.


ఇక బాలీవుడ్ లో బోల్తా కొట్టిన బయోపిక్స్ విషయానికి వస్తే.. 2010లో వచ్చిన డర్టీ పిక్చర్.. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక అక్షయ్ కుమార్ కూడా ఎన్నో బయోపిక్ లు తీసినప్పటికీ ఏవీ పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. అలాగే కంగనా రనౌత్ కూడా ఇప్పుడు ఒక బయోపిక్ లో నటిస్తోంది. జయలలిత బయోపిక్ తీసినా కూడా హిందీలో పెద్దగా ఎవరు పట్టించుకోలేదట. అందుకే హిందీ ఫిలిమ్స్ ఇండస్ట్రీ స్థాయికి తగ్గట్టుగా బయోపిక్స్ రాలేదనే  వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: