ఈ నగరానికి ఏమైంది’ సినిమా సీక్వెల్ 2026లో విడుదల కాబోతున్నట్లు నటుడు విశ్వక్ సేన్ ఒక క్లియర్ హిట్ ఇచ్చాడు. అది 2026 లో థియేటర్లలో రిలీజ్ కావచ్చు అని అతను ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. దాంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను, సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్, సుశాంత్ రెడ్డి ఇలా మొదటి భాగంలో నటించిన అందరూ సీక్వెల్ సినిమాలో కూడా కనిపించబోతున్నారు. ‘35- చిన్న కథ కాదు’ సినిమా నిర్మించిన శ్రుజన్ యరబోలు ఈ సినిమాను ఎస్-ఒరిజినల్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా పాపులర్ కావడంతో, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దర్శకుడు తరుణ్ భాస్కర్ పుట్టిన రోజున ఈ సినిమా గురించి అధికారిక ప్రకటనను చేశారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా భాగస్వామిగా ఉన్నారు. వెంకట్ సిద్దారెడ్డి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మొదటి భాగం ఎంతగా ఆకట్టుకుందో, ఈ సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. తరుణ్ భాస్కర్ మళ్ళీ ఏ రకమైన కొత్త కథతో ప్రేక్షకులను అలరించబోతున్నాడో చూడాలి. ఈ సినిమా కూడా హిట్ అయితే యూత్ లో ఈ దర్శకుడికి చాలా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి యూత్ ఎంటర్టైనింగ్ సినిమాలు మరిన్ని రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆల్ ఇండియా మోజులో పడి మంచి కథలో ఉన్న మంచి సినిమాలను చెడగొట్టకూడదని మరి కొందరు కోరుకుంటున్నారు.