ట్రైలర్ లో డైలాగ్స్ సింపుల్ గానే ఉన్నా సింప్లీ సూపర్బ్ అనేలా ఉన్నాయి. బన్నీ పాన్ వరల్డ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లో ప్రధాన నటీనటులందరికీ ప్రాధాన్యత దక్కగా బన్నీ ఫహద్ ఫాజిల్ పాత్రల మధ్య షాట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. సుకుమార్ మూడేళ్లు ఈ సినిమాను తెరకెక్కించినా ఆ ఎదురుచూపులకు వర్త్ అనేలా ట్రైలర్ ఉందని చెప్పవచ్చు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రేంజ్ కంటెంట్ ను ఆశిస్తారో అదే విధంగా ఈ సినిమా ట్రైలర్ ఉంది. ఈ సినిమా రిలీజ్ కు రెండు వారాల సమయం ఉండగా డిసెంబర్ నెల 5వ తేదీన థియేటర్లు పుష్ప నామస్మరణతో మోత మోగడం పక్కా అని చెప్పవచ్చు. బన్నీ రష్మిక పాత్రల మధ్య కెమిస్ట్రీ సైతం అద్భుతంగా ఉంది. ట్రైలర్ కు బీజీఎం హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.
డిసెంబర్ నెల 5వ తేదీన ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో బన్నీ సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. నార్త్ బెల్ట్ లో పుష్ప హవా మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్ని అంచనాలతో చూసినా ఆ అంచనాలను మించేలా సినిమా ఉండనుందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చింది. భారీ బడ్జెట్ కేటాయించడంతో సుకుమార్ విజువల్ వండర్ గా పుష్ప ది రూల్ ను తెరకెక్కించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.