ఐతే ట్రైలర్ లో సుకుమార్ ఒకచోట బాహుబలి రిఫరెన్స్ వాడుకున్నట్టు అనిపిస్తుంది. బాహుబలి సీన్ ని యాజిటీజ్ లేపేశారా లేదా దాని స్పూరితో అలా చేశారా అన్నది సినిమా వస్తే తెలుస్తుంది. ఇంతకీ అదేంటి అంటే పుష్ప సీన్ లో అందరు కర్రలతో చేసిన ఒక దుంగని పట్టుకుని పుష్ప రాజ్ వస్తుంటే కింద కొడతారు. ఇది హీరో ఎలివేషన్ కి వాడే సీన్.. ఐతే ఇదే బాహుబలి 2 లో ఇంటర్వెల్ కి ప్రభాస్ స్పీచ్ టైం లో రాజమౌళి చూపించారు.
ఆ సీన్ ని అలా డిటో దించకపోయినా పుష్ప రాజ్ కి అభివాదం చేస్తూ అతని ఫాలోవర్స్ అలా చేస్తారని ఆ ట్రైలర్ లో ఆ క్లిప్ అనిపిస్తుంది. మరి అది నిజంగానే అలా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా పుష్ప 2 ట్రైలర్ చూసిన వారంతా బ్లాక్ బస్టర్ పక్కా అనేస్తున్నారు. పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అని.. పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని.. ఇలా ఈసారి పంచు డైలాగ్స్ బాగానే పేలేలా ఉన్నాయి. డిసెంబర్ 5కి బాక్సాఫీస్ పై తన వీర ప్రతాపం చూపించేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఈ బజ్ చూస్తుంటే 1000 కోట్లు పెద్ద మ్యాటర్ కాదనిపిస్తుంది.