తమిళ సినిమా పరిశ్రమలోని తిరుగులేని స్టార్ హీరో ధనుష్‌. ఇక ఇదే ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణి, లేడీ సూపర్ స్టార్‌గా నయనతార వెలుగొందితోంది ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలున్నాయనే వార్తలు తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ వివాదం, నెట్‌ఫ్లిక్స్ సంస్థ నయనతార జీవిత చరిత్ర ఆధారంగా 'నయనతార: బియాండ్ ది ఫేయిర్ టేల్' అనే డాక్యుమెంటరీని తీయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత మొదలైంది.

నయనతార నటించిన 'నానుమ్‌ రౌడీ ధాన్' సినిమా నుంచి 3 సెకన్ల వీడియో క్లిప్‌ను తన డాక్యుమెంటరీలో ఉపయోగించిన తర్వాత ఈ వివాదం మొదలైంది. ఈ సినిమా నిర్మాత ధనుష్, ఈ చిన్న క్లిప్‌ను ఉపయోగించినందుకు నయనతారకు చట్టపరమైన నోటీసులు పంపించాడు. అంతేకాకుండా, ఆమె నుంచి 10 కోట్ల రూపాయల నష్టపరిహారం కూడా డిమాండ్ చేశాడు. దీంతో కోపగించిన నయనతార, సోషల్ మీడియాలో ఒక బహిరంగ లేఖను విడుదల చేసి ధనుష్‌ను విమర్శించింది. ఈ లేఖ వైరల్‌గా మారి, ఈ విషయం చాలా చర్చనీయాంశమైంది.

అంతేకాకుండా, ధనుష్ కేవలం 3 సెకన్ల వీడియో కోసం 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు చూపిస్తూ, ఈ వివాదానికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు ధనుష్‌ను ట్రోల్ చేస్తూ, అతని ఈ డిమాండ్‌ను ప్రశ్నిస్తున్నారు.

నయనతారకు మద్దతు పెరుగుతూనే ఉంది. సినీ పరిశ్రమలోని అనేక నటీమణులు ఆమెకు సంఘీభావం తెలియజేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, ర్యా, అంజ కురియన్, అయిశ్వర్య లక్ష్మి, నజ్రియా, గౌరి జి కిషన్ వంటి నటీమణులు నయనతార సోషల్ మీడియా పోస్ట్‌ను లైక్ చేయడం ద్వారా తమ మద్దతును తెలియజేశారు. నటి పార్వతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నయనతార లేఖను పంచుకుంది.

మరోవైపు, ధనుష్ వకీలు ఒక ప్రకటన విడుదల చేస్తూ, ధనుష్ త్వరలో నయనతార చేసిన వ్యాఖ్యలకు తగిన సమాధానం ఇస్తారని తెలిపారు. ఇద్దరు స్టార్‌లు కలిసి అనేక సినిమాల్లో నటించిన చరిత్ర కలిగి ఉన్నందున ఈ బహిరంగ వివాదం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన సినీ పరిశ్రమలో, అభిమానుల మధ్య వాడివేడి చర్చలకు దారితీసింది.

ఇదిగో ఈ మూడు సెకండ్ల వీడియో కోసమే ఈ రచ్చంత,

https://x.com/kattberrie/status/1857708145335795813?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1857708145335795813%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

మరింత సమాచారం తెలుసుకోండి: