ధనుష్ అసలు హీరో లుక్ లేని ఈ వ్యక్తి తన నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.  సన్నగా కరెంట్ తీగలా ఉండే ఈయన ఏ సినిమా తీసిన చాలా డిఫరెంట్ గా ఉంటుంది.  డిఫరెంట్ యాక్టింగ్ తో కేవలం కథలే ప్రథమ ధ్యేయంగా  ముందుకు వెళుతూ ఉంటారు. అలాంటి ధనుష్  ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అలాంటి ఆయన గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఆయన తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార కు 10 కోట్ల రూపాయల నోటీసులు పంపారు. దీంతో నయనతార ధనుష్ మధ్య తమిళ ఇండస్ట్రీలో పెద్ద వివాదం చెలరేగింది. అలాంటి ఈ తరుణంలో  ధనుష్ అంటే పడని కొంతమంది వ్యక్తులు ఆయనపై కొన్ని వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే తాజాగా సింగర్ సుచిత్ర  ధనుష్ పై సంచలన కామెంట్స్ చేసింది. ధనుష్ వల్ల నేను ఎన్నో కష్టాలు పడ్డాను అని, కేవలం నాయన తారే కాదు నయనతార లాంటి ఎంతోమంది నటీమణులు ఆయన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేసింది. ఆయన దాదాపు 150 మంది నటిమణులను ఇబ్బందులకు గురిచేశాడు అని చెప్పింది..  ఇండస్ట్రీలో చేసింది 50 సినిమాలే అయినా తనకు తల్లి పాత్ర చేసే అమ్మాయిలను కూడా వేధించేవాడు అంటూ చెప్పుకొచ్చింది..

అమ్మాయిలు తనకు లొంగితే ఏం కాదు లేదంటే  నయనతార మాదిరిగా ఏదో ఒక రకంగా వారిని  ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడని, ధనుష్ పెద్ద సైకో క్యారెక్టర్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో ధనుష్ అభిమానులు కోపానికి వస్తున్నారు. ధనుష్ పై ఆమెకు విపరీతమైన ద్వేషం ఉందని, అందుకే ఇలా మాట్లాడుతోందని, మా హీరో సైలెంట్ గా ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదని, త్వరలోనే నిజ నిజాలు ఏంటనేవి బయటకు వస్తాయని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా నయనతార ధనుష్ మధ్య ఏర్పడిన ఈ  వివాదం తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: