తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత శోభన్ బాబు స్టార్ హీరోగా రాణించారు. ఈ హీరోకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేవారు. అతని అందానికి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉండేవారు. ఎవర్ గ్రీన్ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు నటించిన ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అతని సినిమా విడుదల అవుతుందంటే థియేటర్ల వద్ద మహిళలే ఎక్కువగా సంఖ్యలో ఉండేవారు. 


టికెట్ల కోసం క్యూలలో నిలబడే వారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో శోభన్ బాబు ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవాడు. తాజాగా శోభన్ బాబుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శోభన్ బాబుకు ఓ హీరోయిన్ రూ. 3000 కోట్లు ఇచ్చారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు జయలలిత. శోభన్ బాబుకి ఒకానొక సమయంలో వేల కోట్ల రూపాయలను దానం చేసిందట. 



అప్పట్లో ఎంజీఆర్ సీఎంగా ఉన్న సమయంలో స్విస్ బ్యాంకుల్లో డబ్బులను దాచేవారు. ఆ బ్యాంకులో సుమారు 3000 కోట్లు దాచరట. ఆ వివరాలను ఎంజీఆర్ తలపై టోపీలు దాచుకునే వారట. అవి జయలలిత చూసి వాటిని తీసుకుని ఆ డబ్బులు ఎలా ప్రాసెస్ చేయాలనేది తెలుసుకుని అమౌంట్ ని శోభన్ బాబుకు ఇచ్చిందట. 


ఆ డబ్బుతో శోభన్ బాబు కొన్ని వందల వేల ఎకరాల ల్యాండ్ కొని డెవలప్ చేసారట. ఈ విషయాన్ని సీనియర్ రైటర్ తోటపల్లి మధు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరి ఈ వార్తలో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా... అలనాటి హీరోయిన్ జయలలిత... తమిళనాడు రాష్ట్రంలో చక్రాధిపత్యం చెలాయించిన సంగతి తెలిసిందే. ఆమె చాలాసార్లు ముఖ్యమంత్రిగా కూడా గెలవడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆమె మరణించారు. దీంతో ఆ పార్టీని... ఆమె అనుచరులు... లీడ్ చేస్తున్నారు. కొన్ని రోజులు శశికళ ఈ పార్టీని నడిపిస్తారని అనుకున్న.. ఆ తర్వాత పలని స్వామి లాంటి నేతలు... ముందుకు తీసుకువెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: