ఈ సెల్వ రాఘవన్ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నేరుగా తెలుగులో తీసిన చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నది. డైరెక్టర్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సెల్వ రాఘవన్.. ఎన్నో చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించారు. సెల్వ రాఘవన్ కూడా రెండు వివాహాలు చేసుకున్నారు అయితే మొదటి భార్య కూడా చాలామంది చూసే ఉంటారు. ఆమె ఎవరో కాదు 7/G బృందావని కాలనీలో నటించిన హీరోయిన్ సోనియా అగర్వాల్..
7/G బృందావన కాలనీ సినిమా షూటింగ్ తీస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారట. 2006లో వివాహం చేసుకోగా ఆ తర్వాత సినిమాలలో నటించడం మానేసింది సోనియా.. అయితే 2009లో ఈ జంట కొన్ని కారణాల చేత విడిపోయారు. మళ్లీ 2011లో తమిళనాడు మాజీ అడ్వకేట్ రాయన్ కుమార్తెను గీతాంజలిని వివాహం చేసుకున్నారు సెల్వ రాఘవన్. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. అయితే మొదటి భార్య సోనియా అగర్వాల్ మాత్రం ఇప్పటికి సింగల్ గానే ఉన్నది అప్పుడప్పుడు పలు చిత్రాలలో కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ధనుష్ సోదరుడు మొదటి భార్య మాత్రం హీరోయిన్ అన్న సంగతి తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.