- స్టార్ డైరెక్టర్ తో ఇండస్ట్రీలోకి అరంగేట్రం..
- పేరు మార్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ..


 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సీనియర్ హీరోయిన్లలో ప్రియమణి కూడా ఒకరు. తన అందం అభినయం నటనా చాతుర్యంతో  లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అలాంటి ప్రియమణి మన తెలుగు అమ్మాయి కాకపోయినా ఒంటి నిండా తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తుంది.. మరి అలాంటి ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ప్రియమణి కాదట.. ఈమెకు మరో పేరు ఉందని  తెలుస్తోంది. అసలు ప్రియమణి ఎవరు.. ఈమె అసలు పేరేంటి.. ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

 ప్రియమణి అసలు పేరు :


 వాసుదేవమణి అయ్యర్, లతా మణి అయ్యర్ దంపతులకు  ఒక్కగానొక్క కూతురు ప్రియమణి. కేరళ రాష్ట్రంలో ఉన్న పాలక్కాడ్ లోని తమిళ కుటుంబంలో  జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ప్రియా వాసుదేవ మనీ అయ్యర్ అలియాస్ ప్రియమణి..  ప్రియా నాన్నగారు ప్లాంటేషన్ వ్యాపారం చేస్తారు. అమ్మ ఇండియన్ బ్యాంకులో మేనేజర్ గా కూడా పనిచేసేది.. అంతేకాదు ప్రియమణికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు.. ప్రియమణికి చిన్నతనం నుంచే కోపం ఎక్కువ.. వాళ్ళ అన్నయ్య చాలా సైలెంట్ గా ఉండేవారట.. వాళ్ళ అన్నయ్యను ఎవరైనా ఏమైనా అంటే కట్టె పట్టుకొని వెళ్లి మరీ వారిని కొట్టేదట.. అలా ఎంతో కోపానికి వచ్చే ప్రియమణి  సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా శాంత స్వభావురాలు అయింది.. అలా ప్రియమణి కుటుంబం కేరళ నుంచి బెంగళూరు వచ్చిన తర్వాత స్కూల్లో చదువుతున్నప్పటినుంచే సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదట.. ఇక స్కూలింగ్ అయిపోగానే ఇంటర్మీడియట్ లో మోడలింగ్ పై దృష్టి పెట్టి ఆ వైపు మళ్ళింది..అయితే ఆమె మోడలింగ్ వైపు వెళ్లడానికి ప్రధాన కారణం పాకెట్ మనీ.


తల్లిదండ్రులను పాకెట్ మనీ అడిగితే ఇవ్వడంలేదని తాను సొంతంగా సంపాదించుకోవాలని చెప్పి మోడలింగ్ వైపు అడుగులు వేసింది.. అలా కాంచీపురం సిల్క్ హెడ్ అవర్ సిల్క్  వ్యాపార ప్రకటనలో ముందుగా నటించింది.. ఈ టైంలోనే తమిళ దర్శకుడు భారతీ రాజా గారు ఆమె యాడ్ ఫిలిమ్స్ చూసి  ఆఫీసుకు పిలిపించుకొని సినిమాల్లో నటిస్తావా అని అడిగారట. అలా తమిళంలో మొదటిసారి సినిమాకు సైన్ చేసిన ఆమె  ఆ తర్వాత తెలుగులో ఎవరే అతగాడు అనే సినిమాలో మొదటిసారి నటించింది. కానీ ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది.. ఆ తర్వాత మలయాళంలో  పృథ్వీరాజ్ సరసన సత్యం అనే సినిమాలో నటించింది. 2004 ఆగస్టులో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.. ఆ తర్వాత ధనుష్ తో ఓ సినిమా మిక్స్డ్ టాక్ తో వచ్చినా కానీ ప్రియమణి నటనకు మంచి గుర్తింపు వచ్చింది..ఆ తర్వాత జగపతిబాబుతో తెలుగులో పెళ్లయిన కొత్తలో సినిమా చేశారు. ఈ సినిమా భారీ హిట్ అయింది.  ఇక్కడి నుంచి ప్రియమణి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.  అలా వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులోనే టాప్ హీరోయిన్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: