- పేరు మార్చుకొని అదృష్టం పరీక్షించుకున్న రవితేజ..
- చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో గుర్తింపు..
- ఇడియట్ మూవీ తో పూర్తిస్థాయి హీరోగా మారిన రవితేజ..


 సినిమాల్లోకి వచ్చిన చాలా మంది సెలబ్రిటీలు పేరు మార్చుకొని అదృష్టం పరీక్షించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో రవితేజ కూడా ఒకరు. మరి అలాంటి రవితేజ అసలు పేరు ఏంటి..అసలు తన పేరుని ఎందుకు మార్చుకున్నారు.. ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం..

 రవితేజ అసలు పేరు:
రవితేజ.. మాస్ మహారాజా గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈయన సినిమాల్లోకి రాకముందు అసలు పేరు రవితేజ కాదు. కానీ ఆయన సినిమాలోకి వచ్చాక తన పేరుని మార్చుకొని రవితేజ అని పెట్టుకున్నారు.. రవితేజ తెలుగువాడే అయినప్పటికీ తండ్రి ఫార్మసిస్ట్ కావడంతో వృత్తిరీత్యా  పలు ప్రదేశాలకు వెళ్లడంతో ఈయన చదువు మొత్తం నార్త్ ఇండియాలోనే పూర్తయిది. అలా చదువుకున్న రోజుల్లోనే సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో పెరిగి పెద్దయ్యాక చెన్నైకి వచ్చి సినిమాల్లో ట్రై చేశారు రవితేజ. ఆ సమయంలో రవితేజ కి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న సహాయక పాత్రలు చేసే అవకాశం వచ్చింది.అంతేకాకుండా తెర వెనక సహాయ దర్శకుడుగా కూడా పరిచేసారు. అలా మొదటి సారి నాగార్జున చేసిన నిన్నే పెళ్ళాడుతా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు.ఇక చివరిగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన సింధూరం మూవీలో కీలకపాత్రలో చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో మొదటిసారి సోలో హీరోగా నీకోసం మూవీతో హీరోగా చేశారు. అయితే ఈ సినిమా ప్లాఫ్ అయినప్పటికీ రవితేజ నటనకి మంచి గుర్తింపు వచ్చింది.


ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ స్టార్ హీరోగా మాత్రం గుర్తింపు రాలేదు. ఆ తర్వాత వచ్చిన ఔనూ వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో రవితేజ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక రవితేజని మాస్ హీరోగా మలిచిన మూవీ ఇడియట్.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఇడియట్ మూవీ రవితేజని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసింది. ఈ సినిమాతో రవితేజ తన సినీ కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఈ సినిమా రవితేజని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టింది.అలా ఇడియట్ మూవీ రవితేజ సినీ కెరీర్ని మార్చేసింది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి రవితేజ అసలు పేరు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఈయన ఇండస్ట్రీ వారితో పాటు అభిమానులు కూడా అందరూ రవితేజ అనే పిలుచుకుంటారు. అయితే రవితేజ అసలు పేరు రవి శంకర రాజు భూపతి రాజు.. కానీ సినిమాల్లోకి వచ్చాక ఈ పేరు బాలేదని రవితేజ గా మార్చుకున్నారు. అలా పేరు మార్చుకున్నప్పటికీ రవితేజకు అదృష్టం బాగానే కలిసి వచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: