తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. ఎన్నో హిట్ సినిమాలలో నటించిన ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ ను సైతం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్న ఇంద్రజ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. కెరీర్ విషయంలో ఇంద్రజ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
 
అయితే ఇంద్రజ అసలు పేరేంటో చాలామందికి తెలియదు. ఇంద్రజ అసలు పేరు రాజాతి కాగా తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లో సైతం ఆమె నటించారు. కొన్ని సినిమాలలో ఇంద్రజ స్పెషల్ సాంగ్స్ సైతం చేశారు. ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా వ్యవహరించిన ఇంద్రజ ఈ షోల ద్వారా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకోవడం కొసమెరుపు. బాలనటిగా కూడా ఇంద్రజ పలు సినిమాల్లో నటించారు.
 
రాజాతి అంటే అందరికీ అర్థం కాదని భావించిన ఆమె తన పేరును మార్చుకోవడం జరిగింది. జంతర్ మంతర్ సినిమాలో ఇంద్రజ పాత్రను పోషించిన ఇంద్రజ ఆ పాత్ర పేరునే తన పేరుగా మార్చుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి వల్లే తన పేరు మారిందని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇంద్రజ అసలు పేరు గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
 
ఇంద్రజ చూడటానికి నిజంగా దేవకన్యలా ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంద్రజ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రజ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంద్రజను అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇంద్రజ వివాదాలకు సైతం దూరంగా ఉంటారు. ఇంద్రజకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఛాన్స్ దక్కితే ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇంద్రజ టాలెంట్ ను నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: