సాధారణంగా వయస్సు పెరిగితే స్టార్ హీరోయిన్లు యంగ్ గా కనిపించడం జరగదు. అయితే రంభ మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా యంగ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రంభ సొంతూరు విజయవాడ కాగా ఆమె వయస్సు 48 సంవత్సరాలు అంటే ఎవరూ నమ్మరు. అందం, నటనతో ప్రేక్షకుల మెప్పు పొందిన రంభ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
 
యమదొంగ సినిమాలో నాచోరే నాచోరే అంటూ అదిరిపోయే స్టెప్పులతో రంభ అదరగొట్టారు. రంభ అసలు పేరు విజయలక్ష్మి కాగా ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత పేరును మార్చుకున్నారు. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో సినిమాల్లోకి వచ్చిన రంభసినిమా తర్వాత కెరీర్ పరంగ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.
 
రంభ సుదీర్ఘకాలం పాటు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించినా వేర్వేరు కారణాల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పారు. పర్సనల్ కెరీర్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న రంభ రీఎంట్రీ ఇస్తే మాత్రం వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. రంభ యాక్టింగ్, లుక్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రంభ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉంది.
 
రంభ కూతురికి సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రంభ కూతురు రాబోయే రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. రంభ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఆమె ఖాతాలో మరిన్ని విజయాలు చేరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. రంభకు టాలీవుడ్ హీరోలలో సైతం చాలామంది అభిమానులు ఉన్నారు. రంభ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో నటించాలని మరి కొందరు సూచిస్తున్నారు. అందం, అభినయం ఉంటే తెలుగమ్మాయిలు సైతం ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారని రంభ ప్రూవ్ చేశారు. రంభ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి: