సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి ఏ విషయం తెరమీదకి వచ్చి కూడా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రెటీల ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అన్ని విషయాలు కూడా విద్య తెలుసుకోగలుగుతున్నారు ఇంటర్నెట్ జనాలు. ఈ క్రమంలోనే ఏ సెలబ్రిటీ పేరు చెప్పినా వారి గురించి అన్ని తమకు తెలుసు అని చెబుతూ ఉంటారు. కానీ ఇలా అందరికీ తెలిసిన ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయిన సినీ సెలెబ్రిటీలకు సంబంధించి కూడా కొన్ని తెలియని విషయాలు అప్పుడప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇలాంటివి తెలిసినప్పుడు ఈ నిజం తెలియకుండానే ఇన్నాళ్లు ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న కృష్ణవంశీ గురించి ఇలాంటి విషయమే ఒకటి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి దాదాపుగా సినీ ప్రేక్షకులందరికీ తెలుసు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎన్నో హిట్ మూవీస్ తీసి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో కృష్ణవంశీకి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పుడంటే కృష్ణవంశీ సరైన హిట్టు లేక కాస్త వెనకబడిపోయాడు. కానీ ఒకప్పుడు సాదాసీదా హీరోలకు సైతం ఇండస్ట్రీ హీట్ లు ఇచ్చి స్టార్ హీరోలను చేసిన సత్తా కృష్ణవంశీకి ఉంది.



 అయితే కృష్ణవంశీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్పమంటే ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అందులో ఫ్లాప్ అయినవి హిట్ అయినవి అన్ని చెప్పేస్తుంటారు. ఇక పర్సనల్ లైఫ్ గురించి చెప్పమంటే హీరోయిన్ రమ్యకృష్ణను ఆయన వివాహం చేసుకోవడం.. ఇక తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రావడం.. విడాకులు తీసుకోలేదు కలిసే ఉంటున్నారు అన్న విషయంపై క్లారిటీ రావడం చెప్పేస్తారు. కానీ కృష్ణవంశీ అసలు పేరు ఏంటి అంటే మాత్రం చాలా మంది తెల్ల మొహం వేస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయిన కృష్ణవంశీ నిజమైన పేరు ఏంటి అన్నది చాలామందికి తెలియదు. కృష్ణవంశీ అనేది కేవలం స్క్రీన్ నేమ్ మాత్రమే. ఆయన అసలు పేరు ఏంటో తెలుసా వెంకట బంగారు రాజు. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లి గూడానికి చెందిన వెంకట బంగారు రాజుకి చిన్నప్పటినుంచి సినిమాలంటే మక్కువ. ఆఫీస్ బాయ్ గా పని చేసిన ఆయన తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. ఆ తర్వాత చిట్టి అనే దర్శకుడు దగ్గర కూడా పనిచేశారు. ఇక గులాబీ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇక తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెంకట బంగారు రాజుగా ఉన్న ఆయన పేరును ఇండస్ట్రీలోకి  వచ్చిన తర్వాత కృష్ణవంశీగా మార్చుకున్నాడు అయన.

మరింత సమాచారం తెలుసుకోండి: