నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆనతి కాలంలోనే ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను అలరించింది. 2003లో మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2003లో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నయనతార తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది.


ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. సినిమాల పరంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నయనతార 2022లో విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నయనతార అసలు పేరు డయానా. తన కెరీర్ ఆరంభంలో తన మాతృభాషలో 'మానసీనక్కరే' అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో సీనియర్ నటి షీలా ముఖ్యపాత్రను పోషించింది. ఈ సినిమాకు సత్యన్ దర్శకత్వం వహించాడు.


అయితే దర్శకుడికి డయానా అనే పేరు నచ్చలేదు. దీంతో ఆమె పేరు మార్చాలని ఒకరోజు అంతా ఆలోచించే పని పెట్టుకున్నాడు. అలా ఆలోచించిన అనంతరం నటి శీల ద్వారా డయానా పేరును నయనతారగా మార్చేశారు. బాగా ఆలోచించిన తర్వాత నయనతార అనే పేరును పెట్టారట. అలా డయానా కాస్త నయనతారగా మారింది. ఆమె పేరు చివర ఉన్న తార లాగే నయనతార ఒక తారల మిగిలిపోయింది. ఆ తర్వాత ఆమె వెను తిరిగి చూసుకోకుండా వరుస సినిమా అవకాశాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


దాదాపు అన్ని ఇండస్ట్రీలలో తన హవాను కొనసాగించి ముందు వరుసలో ఉంది. నటి కాకముందు డయానా అలియాస్ నయనతార యాంకర్ గా పనిచేసింది. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమంలో యాంకర్ గా చేసింది. అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలలో నయనతార ముందు వరుసలో ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: