అయితే దీన్ని స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ దగ్గర పెద్దగా ఆస్తి లేదు. కమెడియన్ రేలంగి ఈ విషయం తెలుసుకొని ఆయనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. విజయ సంస్థ ద్వారా ఎంతోకొంత ఫైనాన్షియల్ హెల్ప్ అందిస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్నారు. విజయా సంస్థ సహకారంతో ఈ బ్యానర్ పై ఒక సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాలో నటించినందుకు గానూ ఎన్టీఆర్ ఒక్క రూపాయి కూడా శాలరీ తీసుకోకపోవడం విశేషం.
ఆ సినిమా మరేదో కాదు 1959లో వచ్చిన "పగటి చుక్క-రేచుక్క". ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయింది. ఇందులో అగ్ర నటీనటులు నటించారు. సినిమా సెట్టింగ్స్ కూడా చాలా రిచ్ గా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు ఎన్టీఆర్. ఆ భారీ సెట్టింగ్లతో పాటు రెహమాన్ ఫోటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అయ్యింది. ఇందులో ఎస్.వి రంగారావు ఎన్టీ రామారావు అందరూ పోటాపోటీగా నటించారు. అలనాటి హీరోయిన్ షావుకారు జానకి సైతం తన నటనతో ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.
ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది తెలుగులో హిట్ కావడంతో తమిళంలో కూడా దీనిని ప్రొడ్యూస్ చేశారు. ఆ తమిళ వెర్షన్ పేరు ‘‘రాజ సేవై’’. అయితే తెలుగు వెర్షన్ కంటే తమిళ వెర్షన్ సినిమానే ఎక్కువ డబ్బులను కలెక్ట్ చేసింది. అలా కలెక్షన్లు వచ్చిన తర్వాతే తాను ఈ సినిమా కోసం పెట్టిన పెట్టుబడిని రామారావు వెనక్కి తీసేసుకున్నారు. మిగిలిన లాభాలన్నీ తమ్ముడికి ఇచ్చేశారు.