టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తో సుకుమార్ కు ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే కొంత కాలం క్రితం సుకుమార్సినిమా ప్రమోషన్ల విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను ఇంటర్వ్యూ చేశాడు.

అందులో భాగంగా ఆయన మీరు పుష్ప పార్ట్ 1 సినిమా క్లైమాక్స్ అద్భుతంగా తీశారు. ఎలాంటి ఫైట్లు లేకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే క్లైమాక్స్ ఒక అద్భుతమైన ఐడియా అని అన్నాడు. దానితో సుకుమార్ అసలు అది మొదటి పార్ట్ ఎండింగ్ కోసం అనుకోలేదు. పుష్ప సినిమాను మొదలు పెట్టినప్పుడు ఒకే పార్ట్ తో చేయాలి అనుకున్నాం. ఇంటర్వెల్ వరకు సినిమా చేసేసప్పటికీ మూడు గంటల రన్ టైమ్ వచ్చింది. దానితో ఏం చేయాలో అర్థం కాక సినిమాలో రెండు పార్ట్ లుగా చేద్దాం అనుకున్నాం.

దానితో ఒక భాగంతో తీయాలి అనుకున్నప్పుడు ఇంటర్వెల్ అనుకున్న సన్నివేశం కాస్త మొదటి భాగానికి ఎండింగ్ సీన్ అయ్యింది. ఆ తర్వాత ఇంటర్వెల్స్ సన్నివేశం కోసం వెతికే సమయంలో సునీల్ కి వార్నింగ్ ఇచ్చే సిన్ వచ్చింది. ఇక మొదట మేము తీసినప్పుడు కేవలం సునీల్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కానీ ఆ తర్వాత ఇంటర్నల్ సన్నివేశం అనగానే మళ్లీ అలా వెళ్ళిపోతే బాగుండదు అని వెనక్కి వచ్చి మళ్ళీ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించి పెట్టాము అని సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: