వినిపిస్తున్న సమాచారం మేరకు పేర్కొటా జైపూర్లో వాణి కపూర్ వాకింగ్ చేస్తున్న కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో హీరోయిన్ నడుపుతున్న స్కూటీ సైతం సమీపంలో ఉన్న పోలీస్ కార్ ను ఢీ కొట్టడం జరిగిందట. అయితే ఇది ఆ సినిమాలోని ఒక సన్నివేశంలో షూటింగ్ చేయవలసి ఉండగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆమె నడుపుతున్న స్కూటీ అక్కడే ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టినట్లు సమాచారం. అయితే వాణి కపూర్ కు ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఈ స్థలానికి చేరుకొని ఆమెను రక్షించారట. ఈ ప్రమాదంలో ఆమెకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అబిర్ గులాల్ అనే సినిమాలో నటిస్తున్నది వాణి కపూర్. నవంబర్ 18 వ తేదీన జైపూర్ లో శివ విలాస్ హోటల్లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. ఇందులో పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటిస్తున్నారు..వాస్తవానికి ఇమే మొదటి సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందట. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాణి కపూర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో నటించింది. అందుకే హీరోయిన్ వాణి కపూర్ కు జైపూర్ కు మంచి బంధం ఉన్నదట.