చిరంజీవి సినిమాల్లో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఆయన డాన్సులకు తగినట్లుగా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్లు. చిరు స్టెప్పులు చూసే వీళ్లు కొత్త తరహా ట్యూన్స్ పెడతారు. దానికి తగ్గట్టు లిరిక్స్ రాసుకుంటారు. కొరియోగ్రాఫర్స్ డాన్స్ మూవ్‌మెంట్స్, మ్యూజిక్ రెండూ కూడా 100% మ్యాచ్ అవుతుంటాయి. అంటే చిరంజీవి సినిమా పాటల కోసం టెక్నీషియన్లు ఎంతగా కష్టపడతారో ఊహించుకోవచ్చు. చిరంజీవి సాంగ్ కి సంబంధించిన ట్యూన్ విని "నాకు నచ్చింది" అంటేనే ఆ పాట కంప్లీట్ అవుతుంది. లేదంటే సాంగ్ రెడీ కాదు.
అంటే మ్యూజిక్ డైరెక్టర్లు ఒక్కో సాంగ్ కు ఒకటికంటే ఎక్కువ ట్యూన్స్ చేయాల్సి వస్తుందని మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి కానీ ఓ సారి ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ 6 పాటలకు కేవలం 6 ట్యూన్స్ మాత్రమే తయారు చేసి చిరుకి సెండ్ చేశాడు. సాధారణంగా మెగాస్టార్ 10 నుంచి 15 ట్యూన్స్ పంపిస్తే వాటిలో నాలుగు లేదా అయిదు ట్యూన్స్‌కు ఓకే చెబుతుంటాడు. కానీ అన్ని ట్యూన్లు కట్టే సమయం దేవి శ్రీ ప్రసాద్ కి లేకపోవడంతో ఆయన 6 రెడీ చేసి పంపించాడు.
చిరంజీవి షూటింగ్ నుంచి ఫ్రీ అయ్యాక "దేవిశ్రీ ఎన్ని ట్యూన్స్ పంపాడు?" అని అసిస్టెంట్ ని ప్రశ్నించాడట. అయితే ఓన్లీ 6 మాత్రమే పంపించారు సార్ అని చెప్పగానే "ఎంత పొగరు, ఒక్కటి కూడా బాగాలేదని వెనక్కి పంపాపుతా చూడు" అని మనసులో అనుకున్నాడట. ఆ కోపంలోనే ఆయన 6 ట్యూన్స్ వినగా అవన్నీ చాలా బాగా నచ్చేసాయట. ఒక్క ట్యూన్ కూడా రిజెక్ట్ చేసేలా లేదు అనుకుంటూ వాటన్నిటినీ ఆయన ఓకే చేశాడు. చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కోపంతో రిజెక్ట్ చేయాలనుకున్నట్లు కూడా ఆయన ఒప్పుకున్నారు. అదీ రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ప్రతిభ అని చెప్పుకోవచ్చు.