తెలుగు , తమిళ్ సినీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో సమంత ఒకరు. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారా మంచి విజయాలను అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి విజయాలను అందుకొని అక్కడ కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఒక హీరోతో నటించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ హీరో ఎవరు ..? ఆయనతో సమంత నటించిన సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన మూడు సినిమాలలో సమంత హీరోయిన్గా నటించింది. ఆ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మొదటగా విజయ్ , సమంత కాంబోలో అట్లీ దర్శకత్వంలో తేరి అనే మూవీ రూపొందింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో కత్తి అనే సినిమా రూపొందింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత మరోసారి ఈ బ్యూటీ తలపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన మెర్సల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా వీరి కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు రూపొందిగా . . ఆ మూడు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం తన కెరియర్లో 69 వ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈ బ్యూటీ ఓ కీలక పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి దళపతి 69 మూవీ లో సమంత నటిస్తుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: