నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో నరసింహనాయుడు సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. 2001 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి బాలయ్యను టాలీవుడ్‌కు తిరుగులేని మహారాజుగా నిలబెట్టింది. అదే సమయంలో ఈ సినిమాకు పోటీగా మరో ఇద్దరు అగ్ర హీరోలైనా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ నటించిన దేవీపుత్రుడు , మృగరాజు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ఈ రెండు సినిమాలు కూడా నరసింహనాయుడు తుఫాన్లు కొట్టుకుపోయాయి.. ఈ సినిమా వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ ఆ సినిమా సాధించిన రికార్డుల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మన తెలుగు సినిమా చరిత్రను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప సినిమాగా నరసింహనాయుడు ఇండియన్ చలనచిత్ర చరిత్రలోనే 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.


బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్లో 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన సమరసింహారెడ్డి సినిమా కూడా బ్లాక్ బస్టర్డ్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు వీరి కాంబినేషన్లో మళ్ళీ నరసింహనాయుడు వచ్చి అంతకుమించి రికార్డులు క్రియేట్ చేసింది. రాయలసీమ ముఠా కక్షలు ఆధారంగా ఈ సినిమా కథను రాశారు రచయిత చిన్ని కృష్ణ. అలాగే మేడికొండ వెంకట మురళీకృష్ణ నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కింది. అలాగే పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు డైలాగులు అందించారు. ఆ రోజుల్లోనే 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిందిద. ఈ సినిమా స్టోరీ రాయలసీమ ఫ్యాక్షన్ ఆధారంగా చిన్నికృష్ణ రాశారని చాలామంది అనుకుంటారు కానీ ఈ కథకు బీహార్ రాష్ట్రంలో జరిగిన వాస్తవ కథ ఆధారమని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.


30 సంవ‌త్స‌రల క్రితం బీహ‌ర్‌లోని ఓ గ్రామంలో కొంద‌రు మూక‌లు గ్రామంపై దాడి చేయ‌డానికి వ‌చ్చేవాళ్ళ‌ట వాళ్ళ‌ను ఎదుర్కొనేందుకు గ్రామంలో ఒక సైన్యాన్ని నిర్మించుకున్నార‌ట త‌మ గ్రామం కోసం ప్ర‌తి ఇంటి నుండి ఒక మ‌గ పిల్ల‌వాడిని ఆసైన్యాం కోసం అప్ప‌గించేవార‌ట. అంటే వీరు త‌మ మ‌గ‌పిల్లాడిపై ఆశ‌లు వ‌దులుకొనే ఆ సైన్యానికి అప్ప‌గించేవార‌ట‌. ఈలైన్ ఆధారంగా చేసుకుని ర‌చ‌యిత చిన్ని కృష్ణ న‌ర‌సింహ‌నాయుడు క‌థ‌ను రాశారు. ప‌రుచూరి బ‌ద్ర‌ర్స్ ఆ స్టోరికి తుదిమేరుగులు దిద్దారు. ఈ సినిమా ప్ర‌భావంతో టాలీవుడ్ లో ఆ త‌ర్వాత ఐదు,ఆరు సంవ‌త్స‌రాల పాటు ఫ్యాక్ష‌న్ సినిమాలు రాజ్య‌మేలాయి. న‌ర‌సింహ‌నాయుడు బాల‌కృష్ణ కేరిర్‌లో  మాత్ర‌మే కాకుండా, టాలీవుడ్ హిస్ట‌రీలోనే ఓ ప్ర‌త్యేక‌మైన సినిమాగా  మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: