చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను దర్శకులు పిండేయడం సర్వసాధారణం .. ఇప్పటివరకు రాఘవేంద్రరావు తన సినీ కెరీర్ లో 110 సినిమాలు కు పైగా తెరకెక్కించారు. ఎంతో మంది హీరోయిన్లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే ఆయన డైరెక్షన్లో ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం అతిలోకసుందరి శ్రీదేవినే. శ్రీదేవి - రాఘవేంద్రరావు కాంబోలో సినిమా వస్తుందంటే ఓ రేంజ్ లో అంచనాలు ఉండేవి .. వీరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి . ఇదే క్రమంలో రాఘవేంద్రరావు తను తెరకెక్కించిన సినిమాలలో శ్రీదేవి తర్వాత బాగా దగ్గరైన హీరోయిన్ ఎవరు అంటే నగ్మా అన్నిఅంద‌రు అంటారు.


అలాగే రాఘవేంద్రరావు కూడా చాలా ఇంటర్వ్యూలో ఇదే చెప్పుకొచ్చారు .అయితే ఇదే క్రమంలో రాఘవేందర్రావు డైరెక్షన్లో చిరంజీవి హీరో గా వచ్చిన ఘరానా మొగుడు సినిమా లో నగ్మా హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా షూటింగ్ సమయంలో పాపం నగ్మని రాఘవేందర్రావు చాలా ఇబ్బంది పెట్టేరట. మరి ముఖ్యంగా  ఈ సినిమాలో వచ్చే  “ఏందిబే ఎట్టాగ ఉంది ఒళ్ళు ” అనే సాంగ్ షూటింగ్ టైంలో నగ్మని ఓ రేంజ్ లో ఆడుకున్నాడట రాఘవేంద్రరావు . ఈ పాట లో చీర పైకి ఎత్తి మాస్ స్టెప్పులు వేయడం నగ్మా కు పెద్ద గా ఇష్టం ఉండేది కాదట .


అయినా కానీ రాఘవేంద్రరావు గారు ప‌ట్టు పెట్టి ఆమె దగ్గర నుంచి అలాంటి స్టెప్స్ వేయించారట . అంతేకాకుండా తాగుతూ తోలుతూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటూ నిజంగానే మందు తాగమని సజెస్ట్ చేశారట. అయితే నగ్మా అందుకు ససేమీరా ఒప్పుకోకపోవడం తో టేకుల మీద టేకులు తీసుకు ని ఆయన కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ వచ్చే వరకు నగ్మను టార్చర్ చేశారట . హీరోయిన్స్ తో ఎంతో సరదాగా ఉండే రాఘవేంద్రరావులో  .. ఇంత వైల్డ్ యాంగిల్ కూడా ఉందా అంటూ అప్పట్లో జనాలు కూడా ఆశ్చర్యపోయారు . ఇక ఫైనల్లి సినిమా హిట్ అయిన తర్వాత నగ్మా కెరీర్ ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: